T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకుండా పాకిస్తాన్ రెచ్చగొడుతోంది..
- టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్..
- బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం మూర్ఖత్వమే..
- బంగ్లాదేశ్ కి క్రికెట్ కంటే రాజకీయాలే ముఖ్యమా?: మదన్ లాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లకు వెళ్లబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. కోల్‌కతా, ముంబై వేదికలుగా బంగ్లా మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, వాటిని శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరింది. అయితే, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ ఢాకా తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా, భద్రతా కారణాలను చూపిస్తూ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. భారత్‌లో ఆడటం వల్ల తమ జట్టుకు నిజమైన భద్రతా ప్రమాదాలు ఉన్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది.
Read Also: Yamaha Recalls: అలర్ట్.. మీతో ఈ యమహా స్కూటీలు ఉన్నాయా? వెంటనే షోరూంకి తీసుకెళ్లండి!
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ఇక, బంగ్లాదేశ్ నిర్ణయంపై 1983 వరల్డ్ కప్ విజేత, మాజీ భారత పేసర్ మదన్ లాల్ తీవ్రంగా మండిపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనకపోతే అది భారత్‌కు ఎలాంటి నష్టం కాదు, కానీ బంగ్లాదేశ్‌కే భారీ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా, క్రికెట్ అభివృద్ధి పరంగా బంగ్లాదేశ్ చాలా కోల్పోతుందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా మూర్ఖత్వపు నిర్ణయం.. భారత్‌కు ఏం నష్టం జరగదు.. కానీ బంగ్లాదేశ్‌కు మాత్రం అన్నీ నష్టలే జరుగుతాయని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లో ఆడకపోవడం వల్ల ఆర్థికంగా, వాణిజ్యంగా భారీ దెబ్బ పడుతుంది.. ఈ నిర్ణయం వెనుక పాకిస్తాన్ ప్రేరణ ఉందని నేను భావిస్తున్నాను.. భారత్‌ను కిందకు దించాలనే ఉద్దేశంతోనే వారు బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతున్నారని మదన్ లాల్ ఆరోపించారు.
Read Also: Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్డౌన్’ ముహూర్తం ఫిక్స్..
అయితే, బంగ్లాదేశ్ ముంబైలో మ్యాచులు ఆడాల్సి ఉంది.. ముంబై భారత్‌లోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి అని మాజీ క్రికెటర్ మదన్ లాల్ తెలిపారు. భారత క్రికెట్ బోర్డుకు కానీ, భారత్‌కు కానీ దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.. ఇది పూర్తిగా రాజకీయమే.. తమను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల కాలంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది.. బంగ్లాలో మైనారిటీలపై పెరుగుతున్న దాడులు, హింసాకాండలపై భారత్‌లో ఆందోళనలు జరిగాయి.. గత ఏడాది ఈ ఘటనలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని కోరింది. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత భారత్‌లో తమ జట్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ వెల్లడించింది. అందుకే 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్‌కు రావడాన్ని తిరస్కరిస్తున్నామని పేర్కొంది.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు