S*exual Harassment: బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. 2022 మహిళల వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొనింది. ప్రస్తుతం జహనారా బంగ్లా జట్టుకు దూరంగా ఉండగా.. మంజురుల్ ఇస్లాం చేసిన ప్రతిపాదనకు తాను ఒప్పుకోకపోవడంతో తన కెరీర్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. నేను ఒకసారి కాదు.. అనేక సార్లు ఇలాంటి అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నాను అన్నారు. మేం టీమ్ లో ఉన్నప్పుడు చాలా విషయాల గురించి మౌనంగా ఉండాల్సి వచ్చేది.. నిరసన కూడా తెలిపే అవకాశం ఉండదు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్‌లోని చాలా మంది సీనియర్ అధికారుల సపోర్టు కోరడానికి ట్రై చేశాను.. మహిళా కమిటీ ఛైర్‌పర్సన్ నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను అని జహనారా ఆలమ్ వెల్లడించింది.
Read Also: Story Board: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంతో పోతున్న నిండు ప్రాణాలు
అయితే, 2021లో బీసీబీ కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ద్వారా తోహిద్ భాయ్ నన్ను సంప్రదించాడు.. వారు నాతో ఎందుకు తప్పుగా ప్రవర్తించారో అర్థం కాలేదని జహనారా ఆలమ్ పేర్కొనింది. నేను సైలెంట్ గా ఉండి క్రికెట్‌పై దృష్టి పెట్టడానికి చాలా ప్రయత్నించాను అన్నారు.. కానీ, నేను ఆ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తప్పించుకున్నప్పుటికి, మంజుభాయ్ మరుసటి రోజు నుంచే నన్ను అవమానించడం స్టార్ట్ చేశాడని ఆమె తెలిపింది. 2022 ప్రపంచకప్ సమయంలో మంజు భాయ్ రెండోసారి ప్రతిపాదన వచ్చిందని ఆరోపించింది. దీంతో గత ఏడాదిన్నరలో జరిగిన ప్రతి దాని గురించి నేను బంగ్లా క్రికెట్ బోర్డుకి తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నాను.. నేను నాదెల్‌కు చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాను.. కానీ, వారు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే చూపించే వారు అని వెల్లడించింది.
Read Also: SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
కాగా, మా ప్రీ-క్యాంప్ సమయంలో.. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు.. మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లామ్ అసభ్యకరంగా నన్ను తాకాడు అని బంగ్లా పేసర్ జహనారా ఆలమ్ ఆరోపించింది. చాలా మంది మహిళా క్రికెటర్లతోనూ అతడు ఇలాగే వ్యవహరించేవాడు.. షేక్‌హ్యాండ్ సమయంలోనూ కామాంధుడిలా ప్రవర్తించేవాడు.. అలాగే నెలసరి గురించి కూడా అతడు ఇబ్బందికరంగా నన్ను అడుగుతుండేవాడు అని ఆమె అన్నారు. ఇక, ఈ ఆరోపణలను మంజురుల్ ఇస్లాం తీవ్రంగా ఖండించాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలు.. జహనారా ఆలమ్ పై మేం కచ్చితంగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ వైస్ ఛైర్మన్ షఖావత్ హుస్సేన్ తెలియజేశారు.