Icecream : ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు సుర్రుమంటున్నాడు. మండే ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. ఇండ్లనుంచి బయటికి రావడమే లేదు. రోడ్లన్నీ నిర్వానుష్యంగా మారుతున్నాయి. ఏసీలు కూలర్లు లేకుంటే ఇండ్లలో ఉండే పరిస్థితేలేదు. ఉక్కపోత, ఎండకు గొంతు తడి ఆరిపోతుంది. ఆ సమయంలో చల్లటి నీళ్లు లేదా ఐస్ క్రీమ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. బాగా ఎండకు పోయి వచ్చి చల్లచల్లని ఐస్‌క్రీమ్.. కూల్ కూల్ గా గొంతులోకి పడుతుంది అబ్బా ఆ హాయే వేరు. మరి ఐస్‌క్రీమ్ తినాలంటే ప్రస్తుతం ఉన్న ధరల్లో తక్కువలో తక్కువ రూ.15 లేదా 25అయినా ఖర్చు చేయాల్సిందే. మనం తినే ఐస్‌క్రీమ్ ల ధరలు మహా ఉంటే ఓ రెండు మూడు వందల రూపాయలు ఉంటాయి. ధనవంతులు తినే ఐస్ క్రీమ్ అయితే ఇంకో వెయ్యి అదనంగా ఉండొచ్చు.
Read Also:Alliant Group: నగరానికి అలియంట్ గ్రూప్ సంస్థ.. 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు
కానీ ఇప్పుడు ఓ ఐస్‌క్రీమ్ ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అది తినాలనుకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దాని ధర రూ.5.2 లక్షలు. ఏంటి అవాక్కైపోతున్నారా.. ఇది నిజమండి బాబు.. ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాల రూ.5.2 లక్షలు. జపాన్ కు చెందిన ఓ ఐస్ క్రీం కంపెనీ తయారు చేసింది. ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. ఈ ఖరీదైన ఐస్‌క్రీమ్ ధర 8,73,400 జపాన్ యెన్ లుగా నిర్ణయించింది. మన రూపాయిల్లో చెప్పాలంటే, రూ.5.2 లక్షలన్నమా. ఖరీదైన అరుదైన పదార్థాలతో జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. ఇటలీలో పెరిగే వైట్ ట్రఫిల్ (ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థాలలో ఒకటిగా ఈ ఐస్‌క్రీమ్ వినియోగించారు. ఇక ఈ ఐస్‌క్రీమ్ తయారు చేయటానికి సంవత్సరన్నర సమయం పట్టిందని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ కు సంబంధించి 30 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Extramarital Affair: భర్త వేధింపులు.. ప్రియుడి వద్ద భార్య గోడు.. కట్ చేస్తే దారుణం