IND vs PAK: ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఒమన్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలోకి రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, సూపర్- 4 ముందు స్పిన్ ఆల్‌రౌండర్‌కు ఇలా జరిగితే జట్టు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇక, అక్షర్‌కు ఏం కాలేదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. అతడికి స్కానింగ్ చేసే అవకాశం ఉందన్నారు. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ రేపటి మ్యాచ్ లో ఆడొచ్చు.. లేకపోతే మరొకరిని తుది జట్టులోకి తీసుకుంటామన్నారు.
Read Also: MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..
అయితే, ఆదివారం సూపర్ -4లో పాకిస్థాన్‌తో భారత్ మరోసారి పోటీ పడబోతుంది. దీంతో అక్షర్ గైర్హాజరీలో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను బరిలోకి దించాల్సి ఉంటుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి ఫాంలో ఉండగా.. అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలడు, అవసరమైతే అక్షర్ స్థానాన్ని కూడా భర్తీ చేస్తాడు. అక్షర్ పటేల్ ఉండటం వల్ల ఇటు బ్యాటర్‌గా, అటు బౌలర్‌గానూ రాణించేవాడు.. ఇక, రేపటి మ్యాచుకు వాషింగ్టన్ సుందర్ సిద్ధంగా ఉన్నాడు.
Read Also: Siva-Movie : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇక, ఒమన్‌తో మ్యాచ్‌కు ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తికి భారత జట్టు రెస్ట్ ఇచ్చింది. హర్షిత్ రాణా, అర్ష్దీప్సింగ్లను తుది జట్టులో ఆడించింది. అయితే, ఒమన్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. దీంతో సూపర్-4 మ్యాచులకు మళ్లీ పాత జట్టునే బరిలోకి దింపే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు అక్షర్ లేకపోతే అదనంగా మరో బ్యాటర్‌ను తీసుకొనే అవకాశం ఉంది. రింకు సింగ్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లోయర్ బెర్త్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం అత్యంత కీలకం అని భారత్ భావిస్తుంది..