IND vs UAE: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 10న) తమ తొలి పోరులో యూఏఈతో టీమిండియా ఆడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు.. యూఏఈపై గెలవడం పెద్ద కష్టం కాదు. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. యూఏఈ ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ గెలవడం అందరికి తెలిసిందే. పాకిస్థాన్‌తో కీలక పోరు ముందు భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక, జట్టు కూర్పు పరంగా తనను తాను పరీక్షించుకోవడానికి టీమిండియా ఈ మ్యాచ్‌ను వినియోగించుకోవాలనుకుంటోంది.
Read Also: Aamir Khan : ఇంతలోనే అంత మార్పా.. షాక్ ఇచ్చిన అమీర్ ఖాన్ కొత్త లుక్
అయితే, టీమిండియా జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నారు. 2024లో విజేతగా నిలిచిన టి20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్‌లు గెలిచి, మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఇక, జట్టులోకి శుభ్‌మన్ గిల్ పునరాగమనంతో టి20 టీమ్‌లో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడని టాక్. మూడో స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మ ఆ స్థానంలో ఛాన్స్ ఖాయం కాగా నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ కొనసాగనున్నాడు. దాంతో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కు అవకాశం దొరికే మార్గం కనిపించడం లేదు.
Read Also: Kollywood : 96 దర్శకుడితో మలయాళ స్టార్ హీరో.. ఇక రక్తపాతమే
ఇక, సంజూ శాంసన్ సాధారణంగా టాపార్డర్ బ్యాటర్.. టాప్–3లో ఆడకపోతే అతనికి తుది జట్టులో చోటు అనవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ అనుకుంటుంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి చూస్తే.. శాంసన్ కంటే ఫినిషర్‌గా జితేశ్ శర్మ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. పేస్ బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ కలగలిపిన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో జట్టు దుర్బేధ్యంగా ఉంది. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌ల స్థానాలకు ఎలాంటి ఢోకా లేదు. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై అనుమానం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది.
Read Also: UPI Transaction Limits: యూపీఐ లావాదేవీలపై పరిమితులను సవరించిన NPCI
కాగా, యూఏఈ చిన్న జట్టే అయినప్పటికీ.. చాలా కాలంగా టీ20లు, టీ10లు ఆడుతూ పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బ్యాటర్లు ఉండటం ఆ జట్టు సొంతం. ఇటీవల పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లతో కలిసి ఆడిన ముక్కోణపు సిరీస్‌లో ఆ జట్టు బ్యాటర్లు తమ సత్తాను నిరూపించుకున్నారు. కెప్టెన్ మహ్మద్ వసీమ్‌తో పాటు షరాఫు, అసిఫ్ ఖాన్ ఆ సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్‌ల రూపంలో ఆ జట్టుకు మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నారు. భారత్‌పై గెలవకపోయినా సరే గట్టి పోటీ ఇవ్వడానికి యూఏఈ ట్రై చేస్తుందనడంలో సందేహం అవసరం లేదు.
Read Also: Trump: మంచి స్నేహితుడైన మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా
చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్‌లు పూర్తిగా పొడిబారి స్పిన్‌కు బాగా అనుకూలించాయి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి దుబాయ్ లో లేదు. ఈ సీజన్‌లో కొత్తగా, జీవం ఉన్న పిచ్‌లు రెడీ చేశాయి. కాబట్టి అటు బ్యాటింగ్‌తో పాటు పేసర్లకు కూడా మంచి ఛాన్స్ ఉంటుంది. తీవ్రమైన ఎండల మధ్య ఆటగాళ్లు కఠినంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైన ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.
Read Also: The Raja Saab : ది రాజా సాబ్ మ్యూజికల్ జర్నీ మొదలు.. ఫస్ట్ సింగిల్ డేట్ ఔట్”
తుది జట్లు (అంచనా)
టీమిండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేశ్ శర్మ/సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
యూఏఈ: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), షరాఫు, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), అసిఫ్ ఖాన్, మహ్మద్ ఫరూఖ్, హర్షిత్ కౌశిక్, మహ్మద్ జోహైబ్, సఘీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, మహ్మద్ రోహిద్.