Asia Cup Promo Controversy: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూనే ఆసియా కప్ 2025 మొత్తం తిరుగుతోంది. మరో 2 వారాల్లో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుండగా మరోసారి వివాదం చెలరేగింది. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీకి ముందు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన దుబాయ్‌లో జరిగే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ను చూపిస్తూ రూపొందించిన ఈ క్లిప్ ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ వీడియోలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కనిపించడంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐను కూడా ఫ్యాన్స్ నేరుగా దూషిస్తూ, ఈ టోర్నమెంట్ ఒక్క మ్యాచ్ కూడా చూడమని సోషల్ మీడియాలో బాయ్‌కాట్ పోస్టులు పెడుతున్నారు.
Read Also: Cinema Race : రాబోయే నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్
అయితే, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతుందా? లేదా? అనే డౌట్స్ ఉండేది.. బీసీసీఐ వెనక్కి తగ్గితే టోర్నమెంట్ రద్దయే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠ తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన ఏసీసీ అధినేత మోహ్సిన్ నఖ్వీ అన్ని మ్యాచ్‌ల తేదీలు, వేదికలను ప్రకటించారు. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌లు ఈ టోర్నీలో 3 సార్లు పోటీ పడే ఛాన్స్ ఉందన్న వార్తలు టీమిండియా అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించినట్లైంది.
Read Also: India- US Tariff War: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నాడు.. ఆపేస్తే టారీఫ్స్ తగ్గిస్తాం!
ఇక, ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ నుంచి బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం ఈ వివాదాస్పద ప్రోమోలో భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా ఉన్నప్పటికీ.. అభిమానులు వారిని తప్పుపట్టలేదు.. కేవలం సెహ్వాగ్‌పై ప్రత్యేకంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
140 crore dhadkanein ek saath dhadkegi apni #TeamIndia ke liye! 💙🇮🇳 Kyunki rag rag mein hain rang Bharat ka. 🇮🇳🔥
Dekhiye Asia Cup September 9 se Sony Sports Network ke TV Channels aur Sony LIV par!#RagRagMeinBharat #TeamIndia #AsiaCup #SonyLIV #SonySportsNetwork pic.twitter.com/SgCFONOm6n
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2025
140 crore dhadkanein ek saath dhadkegi apni #TeamIndia ke liye! 💙🇮🇳 Kyunki rag rag mein hain rang Bharat ka. 🇮🇳🔥
Dekhiye Asia Cup September 9 se Sony Sports Network ke TV Channels aur Sony LIV par!#RagRagMeinBharat #TeamIndia #AsiaCup #SonyLIV #SonySportsNetwork pic.twitter.com/SgCFONOm6n
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2025