Ind vs Ban : ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇచ్చిన 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే ప్రతిఘటిస్తూ 69 పరుగులు సాధించాడు. అయితే మిగతా 9 మంది బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా అందుకోలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఒక వికెట్ చేరింది. ఈ విజయంతో టీమ్ ఇండియా ఫైనల్‌కి అర్హత సాధించింది.
CM Chandrababu: ప్రపంచంలో హిందువులుండే ప్రతిచోట వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తాం..