World Athletics Championship: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. 19 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Athletics Championship: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది రెండో పతకం మాత్రమే. గతంలో మహిళా అథ్లెట్ పతకం నెగ్గగా పురుషులలో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ నీరజ్ చోప్రానే కావడం విశేషం. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళా అథ్లెట్ అంజు బాబి జార్జ్ లాంగ్ జంప్ విభాగంలో కాంస్య పతకం గెల్చుకున్నారు.
Read Also: Panipuri Challenge: ఈ పానీపూరీ తింటే రూ.500 మీదే..!!
Also Read
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
కాగా ఈరోజు జరిగిన ఫైనల్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరం త్రో చేశాడు. గోల్డ్ మెడల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 90.46 మీటర్ల దూరం విసిరాడు. అతడు తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం త్రో చేశాడు. మూడో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అథ్లెట్ వాద్లెచ్ నిలిచాడు. అతడు 88.09 మీటర్ల దూరం జావెలిన్‌ను త్రో చేయగలిగాడు. ఫైనల్లో నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు దూరం జావెలిన్ విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు జావెలిన్ విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
BREAKING:
World Championship Medal for India!@Neeraj_chopra1 wins Silver Medal in men's Javelin Throw final of the #WorldAthleticsChamps with a throw of 88.13m@WorldAthletics pic.twitter.com/nX0aylUIeU
— DD News (@DDNewslive) July 24, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!