Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
- వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు
- భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Usman Tariq Slams Sri Lankan Police for Security Bias Against India Match: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం వెలుపల భద్రత విషయంలో వివక్ష చూపించారంటూ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీలంక పోలీసులు భారత ఆటగాళ్ల పట్ల సానుకూలంగా ఉంటూ.. తమ పట్ల కఠినంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ తారిక్ మాట్లాడుతూ… ‘మేము భారత్ చేతిలో ఓడిపోయినందుకు బాధపడటం లేదు. గెలుపు, ఓటములు ఆటలో భాగం. కానీ మా ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరి బ్యాగులను శ్రీలంక పోలీసులు రెండు సార్లు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే సమయంలో భారత ఆటగాళ్ల బ్యాగులను మాత్రం కనీసం చెక్ చేయకుండానే పంపించేశారు. మాపై ఈ విధమైన పక్షపాతం ఎందుకు చూపుతున్నారు?’ అని ప్రశ్నించాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఆటగాళ్లందరికీ సమానమైన భద్రతా నిబంధనలు ఉండాలని, కానీ శ్రీలంకలో మాత్రం పాక్ ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారని తారిక్ ఆరోపించారు.
Also Read
- Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
- Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
- Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
- Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
హోటల్ నుంచి స్టేడియానికి వచ్చే సమయంలోనూ, తిరిగి వెళ్లే సమయంలోనూ తనిఖీల పేరుతో పాకిస్థాన్ ఆటగాళ్లను ఎక్కువ సమయం వేచి ఉండేలా చేస్తున్నారని ఉస్మాన్ తారిక్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లు ఏమైనా ఉగ్రవాదులు లాగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశాడు. భారత ఆటగాళ్లకు ఓ రూల్, పాక్ ప్లేయర్లకు మరో రూలా? అంటూ లంక పోలీసులపై తారిక్ ఫైర్ అయ్యాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు క్రికెట్ అభిమానులు భద్రత విషయంలో రాజీ పడకూడదని అంటుండగా, మరికొందరు ఒకే టోర్నీలో రెండు జట్ల మధ్య ఇలాంటి వ్యత్యాసం ఉండటం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. తారిక్ వ్యాఖ్యలపై ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..