Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raima Islam Shimu: బంగ్లాదేశ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి రైమా ఇస్లాం షిము. 1998లో ‘బర్తమాన్’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘జమై షాషుర్’ వంటి దాదాపు 25 చిత్రాలలోనూ, 50కి పైగా నాటకాలలోనూ నటించి మెప్పించారు. నటిగానే కాకుండా టెలివిజన్ షోల నిర్మాతగా, బంగ్లాదేశ్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చురుకైన సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కుటుంబంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, అనుమానాల నేపథ్యంలో 2022 జనవరిలో ఆమె భర్త షఖావత్ అలీ నోబెల్ తన స్నేహితుడితో కలిసి ఆమెను దారుణంగా గొంతు పిసికి చంపి, మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ఢాకా శివార్లలో పడేశాడు. స్వయంగా భర్తే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసినప్పటికీ, కారులో దొరికిన నైలాన్ తాడు, బ్లీచింగ్ పౌడర్ ఆధారంగా పోలీసులు అతడి గుట్టు రట్టు చేశారు.
ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ నేరం జరిగిన తీరును ప్రచురించడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. నాలుగేళ్ల క్రితం షూటింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత శవమై కనిపించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అంతకంటే విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆమె మృతదేహం రెండుగా నరికిన స్థితిలో ఓ సంచిలో లభించింది. ఈ కేసులో ఆమె భర్త సఖావత్ అలీ నోబెల్, అతని స్నేహితుడిపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? రైమా హత్య కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారు?
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
రైమా ఇస్లాం షిము 2022 జనవరి 16న ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కుటుంబ సభ్యులకు ఆమె షూటింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఆమె షూటింగ్ ప్రదేశానికి చేరుకోలేదు. కొంతసేపటి తర్వాత ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. సాయంత్రం వరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే సమయంలో కెరానిగంజ్ ప్రాంతంలోని ఓ వంతెన సమీపంలో అనుమానాస్పదంగా ఓ సంచి కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంచిని పరిశీలించగా అందులో ఓ మహిళ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియలో అది కనిపించకుండా పోయిన నటి రైమా ఇస్లాం షిముదేనని నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసుగా దర్యాప్తు ప్రారంభించారు.
ప్రారంభంలో రైమా హత్య వెనుక సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమెతో గతంలో వివాదం ఉన్నట్లు ప్రచారం జరిగిన నటుడు జాయెద్ ఖాన్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆయనకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు దర్యాప్తులో బయటపడలేదని సమాచారం.
దర్యాప్తు ముందుకు సాగుతున్న సమయంలో పోలీసులకు రైమా కుటుంబానికి చెందిన కారులో కీలక ఆధారాలు లభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కారు లోపల బ్లీచ్ వాసన రావడంతో ఏదైనా సాక్ష్యాలను తొలగించేందుకు దాన్ని శుభ్రం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. కారులో ఓ నైలాన్ తాడు కూడా కనిపించింది. రైమా మృతదేహాన్ని ఉంచిన సంచికి కట్టిన తాడు కూడా ఇదే తరహాలో ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఆ తర్వాత పోలీసుల దృష్టి రైమా భర్త సఖావత్ అలీ నోబెల్‌పై పడింది. అతనితో పాటు అతని స్నేహితుడు ఎస్.ఎం.వై. అబ్దుల్లా ఫర్హాద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల అప్పటి ప్రకటనల ప్రకారం, విచారణలో సఖావత్ తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడైంది.
పోలీసుల కథనం ప్రకారం, రైమా షూటింగ్‌కు వెళ్లే విషయంలోనే కాకుండా ఇతర ఫ్యామిలీ విషయాలపై కూడా ఆమెకు భర్తతో తరచూ గొడవలు జరిగేవి. 2022 జనవరి 16 ఉదయం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ గొడవ తర్వాత సఖావత్ రైమాపై దాడి చేసి, గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ఆరోపించారు. అనంతరం తన స్నేహితుడు ఫర్హాద్‌కు ఫోన్ చేసి మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టి కారు డిక్కీలో ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు. పగటిపూట మృతదేహాన్ని పారవేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరైనా గుర్తించే అవకాశం ఉందని భావించి వెనుదిరిగినట్లు సమాచారం. చివరకు అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో కెరానిగంజ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి సంచిని అక్కడి పొదల్లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రైమా వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. నివేదికల ప్రకారం, దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. రైమా మరణానికి కొన్ని నెలల ముందు తన భర్తపై గృహహింసకు సంబంధించిన ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారాయి.
రైమా హత్య జరిగి నాలుగేళ్లకు పైగా గడిచినా ఈ కేసు ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు. ఆమె భర్త, అతని స్నేహితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగినప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రానట్లు తెలుస్తోంది. మిస్సింగ్ కేసు నుంచి సంచలన హత్య కేసుగా మారిన రైమా ఇస్లాం షిము ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఫ్యామిలీ గొడవలు, క్షణికావేశాలు ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతాయో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
- Tags
- Bangladesh Actress
- cinema
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!