Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Championship 2026 Starts From Today: తిరుపతిలో నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో ఉదయం పోటీల ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడల్లో పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలిరానున్నారు.
అమరావతి ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుపతి జిల్లా యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బందికి వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోటీలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
మరోవైపు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు భారీగా నగదు బహుమతులు అందించనున్నట్లు శాప్ చైర్మన్ ప్రకటించారు. మొత్తం రూ.91.90 లక్షలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విజేతలకు నగదు బహుమతులను మంత్రి నారా లోకేష్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు మంచి వేదిక కల్పించడంతో పాటు.. వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతిలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ ఛాంపియన్షిప్ తో నగరంలో క్రీడా సందడి నెలకొననుంది. వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్న నేపథ్యంలో పోటీల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!