Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoriful Islam Record: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 38.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టి.. బంగ్లాదేశ్ పతనంతో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
రెండో టెస్టులో బంగ్లాదేశ్ దారుణంగా ఓడినా.. ఆ జట్టు స్టార్ పేసర్ షరీఫుల్ ఇస్లాం చరిత్ర సృష్టించాడు. మాకే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన షరీఫుల్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా షరీఫుల్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడం 140 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1886లో ఇంగ్లండ్‌కు చెందిన డిక్ బార్లో మాంచెస్టర్ టెస్టులో 7/44 గణాంకాలతో ఈ ఘనతను సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరూ ఈ రికార్డును అందుకోలేదు.
Also Read
- Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
- Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- IND vs NZ 1st Test: 42 మెయిడిన్ ఓవర్లు.. 43 ఓవర్ల పాటు బ్యాటింగ్.. నాలుగు టెస్టులు డ్రా.. అరుదైన రికార్డులు ఇవే!
- Henry Nicholls: మా బ్యాటర్లు తోపు, ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేశారు.. హెన్రీ నికోల్స్ ఆనందం!
ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది మాత్రం ఇంగ్లండ్ దిగ్గజం జిమ్ లేకర్. 1956 జూలైలో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ ఏకంగా 10 వికెట్లు తీసి 53 పరుగులిచ్చాడు. షరీఫుల్ ఇస్లాం అద్భుత స్పెల్‌తో బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగానికి అండగా నిలిచాడు. అయితే అతడు వ్యక్తిగతంగా చరిత్రాత్మక ప్రదర్శన చేసినప్పటికీ.. మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశపరిచింది. మరోవైపు ఈ సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ చరిత్ర సృష్టించింది. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానం కంటే పైకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంకలను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్ ఆరో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం బంగ్లా 78 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!