Andy Roberts Sensational Comments On India Team: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఇది వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించి, భారత్‌ని 209 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ముఖ్యంగా.. అంచనాలు పెట్టుకున్న భారత బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడం వల్లే, టీమిండియాకి ఈ పరాజయం తప్పలేదు. అందుకే.. టీమిండియాపై ఇప్పటికీ తారాస్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా వెస్టిండీస్ లెజెండ్ సర్ ఆండీ రాబర్ట్స్ చేరిపోయాడు. అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓడిపోయిందని అతడు విమర్శించాడు.
Kurnool Job Fraud: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. వెయ్యి మందికి టోకరా
ఆండీ రాబర్ట్స్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు అహంకారం ఎక్కువైపోయింది. అందుకే.. ప్రపంచ క్రికెట్‌లో మిగితా జట్లను తక్కువగా అంచనా వేస్తోంది. భారత జట్టు ఏదో ఒక సమయంలో కుప్పకూలిపోతుందని నాకు తెలుసు. అందుకే, ఆ జట్టుపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. టెస్ట్ క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా తమ లోపాలపై దృష్టి పెట్టాలి. టీ20 క్రికెట్‌ను నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే.. అందులో బ్యాట్‌కు, బంతికి మధ్య సరైన పోటీనే ఉండదు. నిజానికి.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శిస్తుందని ఊహించాను. కానీ.. అజింక్యా రహానే ఒక్కడే పోరాడాడే తప్ప, మిగితా వాళ్లందరూ విఫలమయ్యారు. తన చేతికి గాయమైనా.. రహానే అద్భుతంగా రాణించాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Meenakshi Chaudhary: కుర్రాళ్లను కునుకు రాకుండా చేసే మంత్రగత్తెవి నువ్వు..
శుబ్‌మన్ గిల్ కొన్ని షాట్లు మంచిగానే ఆడాడు కానీ, అతడు లెగ్ స్టంప్‌పై నిలుచుని తన వికెట్‌ను కోల్పోయాడని రాబర్ట్స్ తెలిపాడు. విరాట్ కోహ్లి కూడా అంతేనని.. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి, అతని వద్ద సమాధానమే లేకుండా పోయిందని చెప్పాడు. నిజానికి.. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, అయినప్పటికీ విదేశాల్లో మాత్రం రాణించలేకపోతున్నారంటూ పెదవి విరిచారు.