Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే అమందు తెలుగు కుర్రకారు గుండెల్లో పీట వేసుకొని కూర్చుంది. హిట్ అందకపోయినా అవకాశాలను అందుకుంది. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నా హిట్ 2 తో మీనాక్షి హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ప్రస్తుతం హత్య సినిమాలో విజయ్ ఆంటోని సరసన నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొట్టేస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిసిపోయింది.
Viral Video: ఏంది రా ఇది.. మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా సామి..
బ్లాక్ టైట్ సూట్ పై కోటు వేసి.. మంత్రగత్తెలా పొడవాటి జుట్టుతో మెస్మరైజ్ చేసే చూపులతో చంపేస్తుంది. ఇక ఆ టైట్ సూట్ లో అమ్మడి శరీర సౌష్టవం చూస్తే ఎవ్వరికైనా మతులు పోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఊరికే వదిలేస్తారా..? నెట్టింట ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కుర్రాళ్లను కునుకు రాకుండా చేసే మంత్రగత్తెవి నువ్వు.. అని కొందరు.. సూపర్ మీనాక్షి.. అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి రావాలంటే మాత్రం మరింత కష్టపడక తప్పదు. మరి ముందు ముందు ఈ చిన్నది ఆ స్టార్ డమ్ ను అందుకుంటుందేమో చూడాలి.