Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సూపర్-8లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి
- ఈ పరాజయం చాలా అవమానకరం
- బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు
Salman Ali Agha on Pakistan Defeat on England in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమిపై పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ పరాజయం తమకు చాలా అవమానకరంగా అనిపించిందని, దాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. మ్యాచ్‌లో పాక్ మంచి క్రికెట్ ఆడిందని, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. రోజు అల్లాహ్ తమ వైపు లేడని, అందుకే ఈ ఓటమి అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ… ‘మొత్తంగా చూస్తే మేము మంచి క్రికెట్ ఆడాం. కానీ చివర్లో విజయం సాధించలేకపోయాం. ఈ రోజు అల్లాహ్ మా వైపు లేడేమో, అందుకే ఓడిపోయాం. అయితే మేము తిరిగి బలంగా వస్తాం. సెమీ ఫైనల్ చేరి టీ20 వరల్డ్‌కప్ గెలిచి మా దేశ ప్రజలను సంతోషపరచాలని కోరుకుంటున్నాం. అల్లాహ్ మాతో ఉంటే ఏదైనా సాధ్యమే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.
Also Read
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
- Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టుకు మిగిలిన మ్యాచ్ కీలకంగా మారింది. ఇకపై శ్రీలంక మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. గ్రూప్-2లో ఉన్న న్యూజీలాండ్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ రెండు గెలిస్తే.. కివీస్ సెమీస్ చేరుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ చేరడం అసాధ్యమే. మరి కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చెప్పినట్లే జట్టు బలంగా తిరిగి వస్తుందా లేదా అన్నది రాబోయే మ్యాచ్‌ల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!