Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత టీ20 జట్టులోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భువి ఆడారు. అయితే ఈ రీఎంట్రీలో ఎనిమిది ఓవర్లలో 99 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకోగలిగారు. మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, భువనేశ్వర్ ప్రదర్శనపై స్పందించారు. భువనేశ్వర్ తిరిగి జట్టులోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని, ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపారు.
అయితే నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అంత సులభం కాదని మోర్కెల్ చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో చిన్న తప్పులు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పైగా ప్రాక్టీస్ చేయడానికి తక్కువ సమయం దొరకడం కూడా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్ వద్ద తగినంత అనుభవం, నైపుణ్యం ఉన్నాయని, ఆయనపై ఉన్న ఒత్తిడిని, ఇతరుల అంచనాలను పక్కన పెట్టి తన సహజసిద్ధమైన ఆటను మాత్రమే ఆడాలని సూచించారు. ప్రశాంతంగా ఉంటూ క్రమంగా తన లయను అందుకోవాలని, బయటి విమర్శలను పట్టించుకోవద్దని కోరారు.
Also Read
- Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా 'అర్నబ్'.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
- AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
- IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
మరోవైపు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిపత్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుతమైన రన్ ఛేజింగ్ చేసి విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. వెల్లింగ్టన్లో వీచే తీవ్రమైన ఈదురు గాలులు బౌలర్లకు, బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారతాయని మోర్కెల్ పేర్కొన్నారు. ఈ గాలులను తట్టుకుని క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుందని అన్నారు. అక్టోబర్ 27న జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!