Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek, Vaibhav Interview: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ 38 బంతుల్లో సెంచరీ (113 పరుగులు) చేయగా.. వైభవ్ 19 బంతుల్లో 45 పరుగులు బాదాడు. మ్యాచ్ అనంతరం ఈ ఇద్దరు యువ బ్యాటర్లు ప్రత్యేకంగా చిట్‌చాట్ నిర్వహించారు. ఇందులో ఒకరినొకరు ప్రశ్నలు అడుగుతూ.. తమ ఇన్నింగ్స్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మూడో టీ20లో తొలి బంతిని ఎదుర్కొనే సమయంలో ఏం ఆలోచించావని అభిషేక్ శర్మ అడగ్గా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘గత మ్యాచ్‌లో తాను బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నా. నా సహజమైన టీ20 ఆటతీరుకు భిన్నంగా నెమ్మదిగా ఆడేందుకు ప్రయత్నించా. ఈసారి మాత్రం నాకు మంచి అవకాశం లభించింది. తొలి బంతి నుంచే వేగంగా పరుగులు సాధించాలని నిర్ణయించుకున్నా. అది వర్కౌట్ అయింది. నా సహజమైన దూకుడుతో ఆడటమే ఈ ఇన్నింగ్స్‌లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నా’ అని బుడ్డోడు చెప్పుకొచ్చాడు.
Also Read
- Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
- Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
- Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
- SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
వైభవ్ సమాధానంపై అభిషేక్ శర్మ స్పందిస్తూ.. తాను కూడా అదే విషయాన్ని ఆలోచించానని చెప్పాడు. ‘ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో భారీగా పరుగులు సాధించేందుకు వైభవ్ ఆటతీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అతడు తొలి బంతిని ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి షాట్ ఆడతాడో తెలుసుకోవాలనే ఆసక్తి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు కూడా ఉంటుంది. ఈ టీ20లో వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి దూకుడు భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించింది’ అని అభిషేక్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో తాను సాధించిన సెంచరీ వెనుక వైభవ్ పాత్ర కూడా ఉందని అభిషేక్ చెప్పాడు. వైభవ్ వేగంగా పరుగులు సాధిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడని, అతడి బ్యాటింగ్ తనకు కూడా స్వేచ్ఛగా ఆడేందుకు అనుకూల పరిస్థితులను కల్పించిందని అభిప్రాయపడ్డాడు. అందుకే తన ఇన్నింగ్స్ క్రెడిట్‌ను వైభవ్‌కు కూడా ఇస్తానని తెలిపాడు.
తాజావార్తలు
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..