Virat Kohli: విరాట్ కోహ్లీకి లేడీ ఫ్యాన్ లిప్‌లాక్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Lady Fan Kissed Virat Kohli Wax Statue Lips: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా.. విశ్వవ్యాప్తంగా ఇతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. అసలు టీవీల్లో చూస్తేనే.. కోహ్లీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. అలాంటిది.. లైవ్‌లో కనిపిస్తే ఊరికే ఉంటారా? అతడ్ని చూసేందుకు, కలిసి ఫోటో దిగేందుకు ఎగబడిపోతారు. ఒకవేళ కోహ్లీతో ఫోటో దిగే అవకాశం రాకపోతే.. అతని పోస్టర్లతోనే ఫోటోలు దిగి మురిసిపోతుంటారు. అదీ.. కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్. ఇప్పుడు ఓ లేడీ ఫ్యాన్ కోహ్లీ మైనపు బొమ్మను ముద్దాడటం హాట్ టాపిక్‌గా మారింది.
Volodymyr Zelenskyy: చైనా ఆ పని చేస్తే ‘వరల్డ్ వార్’ తప్పదు.. జెలెన్‌స్కీ హెచ్చరిక
Also Read
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
క్రికెట్ క్రీడలో ఎన్నో రికార్డులు, ఘనతలో సాధించిన కోహ్లీ సేవలను గుర్తిస్తూ.. అతని మైనపు బొమ్మను సిద్ధం చేశారు. ఒకటి ఢిల్లీలో ఉండగా, మరొకటి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంది. ఈ మైనపు బొమ్మను చూసిన కోహ్లీ ఫ్యాన్.. తన ఆనందాన్ని ఆపుకోలేక ఆ బొమ్మ పెదాలపై ముద్దాడింది. తాను నిజంగానే కోహ్లీని ముద్దాడుతున్నంత ఆనందాన్ని ఆ ఫ్యాన్ కనబరిచింది. ఓసారి పెదాలపై, మరోసారి తన బుగ్గలకు ఆ బొమ్మ పెదాలు తాకేలా ఆ లేడీ ఫ్యాన్ వీడియో తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోహ్లీ బొమ్మను ఆమెను చూస్తున్న విధానం, ముద్దాడాక మురిసిపోయిన తీరు చూస్తే.. కోహ్లీ అంటే ఆ లేడీ ఫ్యాన్‌కి ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు.
Mystery Revealed : మిస్సింగ్ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో
ఇదిలావుండగా.. గతేడాది ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ టీ20, వన్డే ఫార్మాట్‌లలో సెంచరీలు చేశాడు. కానీ, టెస్టుల్లోనే ఇంకా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు టెస్టుల్లో చివరిసారి సెంచరీ చేసింది 2019 నవంబర్ 22న. ఆ తర్వాతి నుంచి టెస్టుల్లో అతడు సెంచరీ చేసిందే లేదు. ఈ నేపథ్యంలోనే.. ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ దుమ్ముదులిపేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలి రెండు టెస్ట్ మ్యాచెస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. మూడో మ్యాచ్‌లో అయినా రప్ఫాడిస్తాడని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023
తాజావార్తలు
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!