హెలికాఫ్టర్లు, విమానాలు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనిపించకుండాపోతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా జరిగిందా? అంత పెద్ద రైలును ఎలా దాచేస్తారా..? అనేగా మీ ప్రశ్న. 1911లో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సొరంగంలోకి ప్రవేశించిన రైలు మిస్టీరియస్‌గా అదృశ్యమైంది. అప్పుడు కనిపించకుండా పోయిన రైలు జాడ ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కనీసం దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ రైలు ఎక్కడికి వెళ్లింది? ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.ఇది ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటి.
Also Read : UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు అప్లై చేశారా.. గంటలే గడువు!
ఇదిలా ఉంటే.. తాజాగా.. 90 కంటైనర్లతో నాగ్‌పూర్ నుంచి ముంబైకి బయలుదేరిన రైలు గత 13 రోజులుగా కనిపించకుండా పోయిందనే వార్త వైరల్‌గా మారింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మిహాన్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి బయలుదేరిన రైలు మరో నాలుగైదు రోజుల్లో ముంబైలోని జేఎన్‌పీటీకి చేరుకోవాల్సి ఉంది.
Also Read : Rooster Attack: వామ్మో.. ఈ కోడిపుంజు మహా డేంజర్.. యజమానిని పొడిచి చంపేసింది!
అయితే 12 రోజులు గడిచినా వేలకోట్ల రూపాయల విలువైన ఎగుమతి సామాగ్రి నింపిన కంటైనర్లతో రైలు రాలేదని, రైలు ఎక్కడుందో అధికారులు గుర్తించలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. రైలు PJT1040201 తప్పిపోయినట్లు కూడా నివేదించబడింది. నాసిక్ మరియు కళ్యాణ్ మధ్య ఉంబర్మాలి రైల్వే స్టేషన్‌లో రైలు చివరిసారిగా కనిపించిందని మరియు భారతీయ రైల్వే యొక్క ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (FOIS) నుండి దాని స్థానం అదృశ్యమైందని మరియు దాని గురించి అధికారులకు ఇప్పుడు ఎటువంటి సమాచారం లేదని నివేదించింది. అయితే, ఈ వార్త నిరాధారమని, జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుకు గూడ్స్ రైలు వచ్చిందని, రైలు వచ్చినట్లు కంటైనర్ కార్పొరేషన్ తెలిపింది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వార్తల్లో నిజమెంతో సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని రైల్వేశాఖ కోరింది. కొన్ని సాంకేతిక కారణాలతో రైలును గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు.