T20 cricket: పొట్టి క్రికెట్లో మరీ ఇంత చెత్త రికార్డా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 cricket: పొట్టి క్రికెట్ ఫార్మాట్ అదేనండి టీ-20లు ప్రారంభం అయిన తర్వాత.. బ్యాటింగ్‌లు ఎక్కడలేని దూకుడు చూస్తున్నాం.. కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు ఈ మ్యాచ్‌లు వేదిక అవుతున్నాయి.. అప్పడప్పుడు బౌలర్లు మెరిసినా.. పైచేయి మాత్రం బ్యాటింగ్‌దే అని చెప్పాలి.. కానీ, అలాంటి ఫార్మాట్లో ఓ చెత్త రికార్డు నమోదైంది.. చెత్త రికార్డు కంటే దానిని పరమ చెత్త రికార్డుగా చెప్పుకోవాలి.. ఎందుకంటే టీ20లో సంచలనాన్ని సమోదు చేస్తూ.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది.. ఇక, 11 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మరో జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. ఇంతకీ.. ఈ రికార్డు నమోదైన మ్యాచ్ విషయానికి వెళ్తే..
Read Also: CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
పొట్టి క్రికెట్లో ఇప్పటివరకూ అత్యల్ప స్కోర్ సిడ్నీ థండర్స్ పేరు మీద ఉంది.. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే పెవిలియన్ చేరింది.. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు టీ20ల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది… అయితే, ఇప్పుడు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు.. ఆ రికార్డును తిరగరాస్తూ.. కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. దీంతో, ఈ ఫార్మాట్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ‘ఇస్లే ఆఫ్ మ్యాన్’ -‘స్పెయిన్’ జట్ల మధ్య ఆదివారం లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది.. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లు ఆడి 10 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్లో అతి తక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు ఇప్పటి వరకు సిడ్నీ థండర్స్ పేరున ఉండగా.. ఇప్పుడా రికార్డును ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు చెడిపేసింది..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, 11 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పానిష్ జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది.. ఓపెనర్ అవైస్ అహ్మద్ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, 2019లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నెల 25న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ 66 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు ఆ జట్టు 16 టీ20లు ఆడింది. వీటిలో 8 మ్యాచ్‌లో గెలిచింది. ఏడింటిలో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్పెయిన్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 0-5తో ఓటమిని మూటగట్టుకోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు.. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. స్పెయిన్ బౌలర్ మహమ్మద్ కమ్రాన్ మూడో ఓవర్లో హ్యాట్రిక్ సాధించాడు. ల్యూక్ వార్డ్, కార్ల్ హర్తమాన్, ఎడ్వర్డ్ బియర్డ్ వరుసగా మూడు బంతుల్లో ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కమ్రాన్‌తో పాటు అతిఫ్ మహమూద్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా టీ20లో బ్యాటింగ్‌తో విధ్వంసమే కాదు.. బాల్‌తోనూ రికార్డులు సృష్టించవచ్చు అని నిరూపించారు బౌలర్లు..
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!