Dussehra: ఈ సృష్టిని నడిపిస్తున్నది త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను కన్న మూర్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ప్రేమను పంచడంలో అమ్మ, తప్పును సరిద్దిద్దడంలో గురువు, ఈ సృష్టిని కనుసైగలతో శాసించగల ఆదిపరాశక్తికి తారతమ్యాలు లేవు. అందరిని ఒకే తీరుగా చూస్తుంది. అమ్మకి ఆగ్రహం అనుకుంటున్నారు చాలంది. కానీ బిడ్డలను అనుగ్రహించడం వాళ్ళకి అనురాగం పంచడం మాత్రమే తెలుసు ఆ మహాశక్తికి. అందుకే జగజనని అంటారు ఆ తల్లిని. అంటే ఈ జగత్తు అంతటికి అమ్మ ఆదిపరాశక్తి. ఆమె ఈ విశ్వంలోని ప్రతి జీవిని తన బిడ్డగానే చూస్తుంది, అమ్మకి పక్షపాతం ఉండదు. అనడానికి ఈ కథనే ఉదాహరణ. పూర్వం భోజ మహారాజు ఆస్థానంలో దండి, భవభూతి, కాళిదాసు అనే ముగ్గురు దిగ్గజ కవులు ఉండేవారు. ఆ ముగ్గురు కవులు పాడిత్యంలో ఒకరిని మించిన వారు ఇంకొకరు. అయితే ఒకనాడు భోజ మహారాజుకు వారిలో ఎవర్ని ‘మహాకవి’ అని సంబోధించాలి? అనే సందేహం కలిగింది.
Read also:Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
ఈ చిక్కు ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు. ఈ ముగ్గురు పాండిత్యాన్ని పరీక్షించి బేరీజు వేయగల ఉద్దండులు ఎవరు లేరు. కనుక ఈ సందేహాన్ని ఆ ఉజ్జయినీ మహంకాళినే తీర్చాలి అని ఆ తల్లి పైనే భాధ్యతను ఉంచాడు. ఆ తల్లినే నా సందేహాన్ని నివృతి చెయ్యాలని ముగ్గురినీ వెంటబెట్టుకుని ఆలయానికి వెళ్లాడు. తన సందేహాన్ని మూల మూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికి ‘కవిర్దండి’ అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే.. దండే! అనంతరం ‘భవభూతిస్తు పండితః’.. పాండిత్యమంటే భవభూతిదే అనే పలుకూ వెలువడింది. అయితే తన గురించి ఎం చెప్పలేదని కాళిదాసుకు కోపం కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో భరించలేని వేదన దుఃఖంగా మారగా వస్తున్న ఏడుపును ఆపుకోవడం వల్ల స్వరం దగ్ధంగా మారింది. అయిన తీవ్ర స్వరంతో మరి మరి నేనెవర్నే? అని ఆ తల్లిని నిలదీసాడు.
Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
మాట్లాడితే అమ్మ వారి మీద లాలాజలం తుంపర్లు ఎక్కడ పడతాయో అని ఆ గంగా జనుకుడు సైతం చేయి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అమ్మతో మాట్లాడడానికి అందరూ భయపడతారు. కానీ కాళిదాసు అమ్మని ఏకవచనమ్ తో పిలిచినా అమ్మ శాంత మూర్తి కనుక బిడ్డ తప్పుగా మాట్లాడిన ఓర్పుగా.. నువ్వే నేను నేనే నువ్వు ఇందులో నీకు ఎలాంటి సందేహం వద్దు అని ఒక్క మాటలో సమాధానం ఇచ్చింది. ‘నీ అక్షరం.. బీజాక్షరం’ అని చెప్పకనే చెప్పింది. ఆ మాటకు కాళిదాసు హృదయం ద్రవించింది. కన్నీళ్లతో ఆ తల్లి పాదాల పైన పాడ్డారు. ఎదుటి మనిషి చేసిన తప్పును తప్పు అని నొప్పించకుండా చెప్పే శక్తి ఒక ప్రేమకే ఉంది. ఆ ప్రేమకి నిదర్శనం ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ ఆదిపరాశక్తి. ఆర్తి తో అమ్మ అంటే చాలు పలుకుతుంది ఆ పరమేశ్వరి.