Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకేక్కించారు.పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరియు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, ప్రభాకర్, గౌతమి మరియు ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ తో విడుదలకు ముందే హైప్ సొంతం చేసుకున్న స్కంద సెప్టెంబర్ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. పాజిటివ్ రివ్యూస్‌తో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. రామ్ స్కంద సినిమాలో మొదటిసారిగా ఊర మాస్ హీరోగా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 35 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.కాగా థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 27 నుంచే స్కంద డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈమూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్కంద సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!