Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్ చేసిన ‘బిరా 91’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer: బీరు సీసాలను మద్యంప్రియులు సరదాగా బీరకాయలు అని పిలుచుకుంటారు. బీరు.. ప్రపంచంలోనే అతిపురాతన ఆల్కహాల్ డ్రింక్. అన్ని పానీయాలతో పోల్చితే.. ఇది.. నీరు, తేనీరుల తర్వాత.. 3వ స్థానంలో నిలుస్తుంది. యంత్రాలతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే బీరును క్రాఫ్ట్ బీర్ అంటుంటారు. మన దేశంలోని చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్లలో ‘Bira-91’ కూడా ఒకటి.
ఈ సంస్థ.. ఇండియాలోని అతిపెద్ద బీర్ తయారీ కంపెనీల్లో 4వ స్థానంలో ఉంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ Bira-91 ఉత్పత్తి.. రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. సప్లై చెయిన్ విస్తరించనుంది. ఆవిష్కరణ సామర్థ్యాలు సైతం మెరుగుపడనున్నాయి. ఈ మేరకు.. ఈ సంస్థ.. తాజాగా.. 100 లక్షల డాలర్ల నిధులను సమీకరించింది. జపాన్‌లోని అతిపెద్ద బ్యాంక్ అయిన MUFG Bank నుంచి ఈ ఫండ్‌ను రైజ్ చేసింది.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
read more: Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?
ఈ సిరీస్-డి ఫండింగ్ రౌండ్‌కి.. జపాన్‌కే చెందిన బీర్ కంపెనీ కిరిన్ హోల్డింగ్స్ సారథ్యం వహించింది. Bira-91 సంస్థకు మన దేశంలోని అన్ని కీలక మార్కెట్లలో కలిపి 5 శాతం షేర్ ఉంది. ఈ వాటా.. కరోనా ముందు నాటి కన్నా మూడింతలు పెరగటం విశేషం. మరో వైపు.. ఇండియాలో బీర్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి.
వినియోగదారుల జీవనశైలి మారటం, ఆల్కహాల్ పానీయాలను ఎక్కువగా తాగుతుండటం, బీర్లకు సంబంధించిన బ్రాండ్లపై కస్టమర్లలో అవగాహన పెరగటం వంటివాటిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో MUFG Bankతో కలిసి ప్రయాణం ప్రారంభించటం పట్ల Bira-91 కంపెనీ సంతోషంగా ఉంది. MUFG Bankతో పార్ట్నర్షిప్ ఏర్పాటుచేసుకోవటం వల్ల ప్రపంచ పెట్టుబడి సంస్థలతో పరిచయాలు పెరుగుతాయని ఆశిస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని నిధులను సమీకరించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని అనుకుంటోంది. Bira-91 సంస్థకు భారతదేశంలో 5 తయారీ యూనిట్లు ఉన్నాయి. వాటిలో పాతిక లక్షల హెక్టో లీటర్ల బీరును ఉత్పత్తి చేస్తోంది. ఒక హెక్టో లీటర్ వంద లీటర్లకు సమానం. దీన్నిబట్టి Bira-91 కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీని అర్థంచేసుకోవచ్చు.
ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లోని 550 పట్టణాల్లో విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇండియాలో.. క్రాఫ్ట్ బీర్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. మొత్తం బీర్ మార్కెట్లో దీనికి 2 నుంచి 3 శాతం వరకు వాటా ఉంది. ఈ పరిశ్రమ ఏటా 20 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ఆలిండియా బ్రీవర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. కాబట్టి.. Bira-91 కంపెనీ.. బీరు బిజినెస్‌లో చక్రం తిప్పబోతోందని భావించొచ్చు.
- Tags
- alcohol
- Beer
- Bira 91
- Craft beer
- drink
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!