Youth Review : యూత్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Ken Karunas, Anishma Anilkumar, Meenakshi Dinesh, Suraj Venjaramoodu, Devadarshini Chetan, Priyanshi Yadav
- DIRECTOR: Ken Karunas, Pradeep Devakumar, Joshua Williams
- MUSIC:
- PRODUCER: Sulochana Kumar, Karuppiah C Ram, Kali Rajkumar
ధనుష్ వంటి స్టార్ హీరోల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కెన్ కరుణాస్, యూత్ చిత్రంతో అటు దర్శకుడిగా, ఇటు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళంలో ఒక వారం ముందే రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. నిజానికి స్కూలింగ్ లేదా కాలేజ్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మన పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, నేటి తరం ఆలోచనలను ప్రతిబింబించే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తాజాగా అదే కోవలో, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘యూత్’ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన కెన్ ఈ సినిమాతో హీరోగా మారుతూనే డైరెక్టర్గా కూడా తన ప్రయత్నం తాను చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఒక మధ్యతరగతి కుర్రాడు అతని తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బేకరీ నడుపుతూ క్రమశిక్షణగా ఉంటే, తల్లి సరోజ (దేవదర్శిని) కొడుకును ప్రాణంగా చూసుకుంటుంది. స్కూల్ డేస్‌లో ఎలాగైనా ఒక అమ్మాయి ప్రేమను పొందాలని తపించే ప్రవీణ్ జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు (ప్రేషిక, సోనల్, గంగవల్లి) వస్తారు. ఈ క్రమంలో అతనికి ఎదురైన బ్రేక్-అప్స్, అవమానాలు అతన్ని ఎలా మార్చాయి? అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు బాధ్యత గల వ్యక్తిగా ఎలా ఎదిగాడు? తల్లిదండ్రుల కలలను నిజం చేశాడా లేదా? అన్నదే మీరు బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా తమిళంలో హిట్ టాక్ నేర్చుకున్న తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా సినిమా మీద ఆసక్తి పెరిగింది అయితే సినిమా చూసిన తర్వాత ఇదేదో కొత్త పాయింట్ అనుకుంటే పొరపాటే. దర్శకుడు కెన్ కరుణాస్ ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. ఒక కుర్రాడు టీనేజ్ లో ఉండగా వయసు ప్రభావంతో పడిన ప్రేమ కథలు, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇది మనం తరచుగా చూసే ఫార్ములానే. కానీ, ఆ కథను చెప్పిన విధానం, నేటి యువత ప్రవర్తనను సహజంగా చూపించిన తీరు ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా సరదాగా, స్కూల్ వాతావరణం, టీనేజ్ అల్లరితో చాలా వేగంగా సాగిపోతుంది. ప్రవీణ్ చేసే పనులు, అమ్మాయిల వెంట పడటం వంటి సీన్లు యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సెకండ్ హాఫ్ లోని అసలు సినిమా మొదలవుతుంది. కేవలం ప్రేమ మాత్రమే కాకుండా, తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యతను దర్శకుడు ఎమోషనల్‌గా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దారు. కొత్తదనం లేకపోయినా తనదైన శైలిలో కథనంతో సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దానికి తోడు తెలుగు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా మేం కంటెంట్ తో పాటు అప్పట్లో బాగా వైరల్ అయిన కొన్ని సాంగ్స్ ని వాడుకున్న తీరు సినిమాని చాలా వరకు నిలబెట్టిందనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే హీరోగా కెన్ కరుణాస్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అతని నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లుగా నటించిన అనీషా అనిల్, మీనాక్షి, ప్రియాన్సీ తమ పరిధి మేరకు మెప్పించారు. అయితే, ఈ సినిమాకు పిల్లల కంటే తల్లిదండ్రులుగా నటించిన సూరజ్ వెంజరమూడు, దేవదర్శినిల నటన ప్రాణం పోసింది. ఒక మధ్యతరగతి తండ్రి ఆవేదనను సూరజ్ అద్భుతంగా పండించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. విక్కీ సినిమాటోగ్రఫీ స్కూల్, కాలేజీ విజువల్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్‌ను తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త క్రిస్పీగా ఉండేది.
ఫైనల్లీ: ‘యూత్’ కేవలం యూత్ కోసం మాత్రమే తీసిన సినిమా కాదు. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా.
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!