నేషనల్ ఓటీటీ సంస్థలు సైతం ఇప్పుడు లోకల్ కంటెంట్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జీ5 సంస్థ ‘విరాటపాలెం’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించింది. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా ఉన్న అభిజ్ఞ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ పేరు ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. రెక్కీ అనే సిరీస్ డైరెక్ట్ చేసిన పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. శుక్రవారం నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈటీవీ విన్ సంస్థ తాము రూపొందిస్తున్న ‘కానిస్టేబుల్ కనకం’ స్క్రిప్ట్‌తోనే ఈ సిరీస్ చేశారని ఆరోపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సిరీస్ మీద పడింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది రివ్యూ చూద్దాం.
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ కథ
ఒంగోలు తాలూకాలోని విరాటపాలెం అనే పల్లెటూరిలో ఓ నవవధువు పెళ్లి పీటల మీద రక్తహీనత కారణంగా చనిపోతుంది. ఆ తర్వాత ఆ ఊరిలో పెళ్లి చేసుకున్న ఏ పెళ్లికూతురైనా రక్తం కక్కుకుని చనిపోతూ ఉండడంతో, తమ ఊరికి అమ్మవారు శాపం పెట్టిందని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ ఊరిలో శుభకార్యాలు చేసుకోకుండా గడిపేస్తూ ఉంటారు. కొంతమంది ఆస్తులు అమ్ముకొని ఊరు వదిలి వెళ్లిపోతే, మరికొంతమంది వేరే ఊరికి వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడతారు. అలాంటి గ్రామానికి మీనా(అభిజ్ఞ) పోలీస్ కానిస్టేబుల్‌గా వస్తుంది. ఆమె వచ్చాక ఈ శాపం గురించి అందరూ ఆమెను భయపెడుతూ ఉంటారు. అయితే, మూఢనమ్మకాలపై ఏమాత్రం నమ్మకం లేని ఆమె, గ్రామ ప్రెసిడెంట్ ప్రపోజల్ మేరకు అతని కొడుకును పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఎలాంటి శాపాలు లేవని, కేవలం ఎవరో చేస్తున్న కుట్ర అని తేల్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమెపై కూడా విషప్రయోగం జరుగుతుంది. అసలు ఈ పెళ్లికూతురుల మరణాల వెనుక ఉన్న కారణం ఏమిటి? మీనా ఈ విషయాన్ని తెలుసుకున్నదా? ఈ క్రమంలో మీనాకు సాయం చేసిన టీ కొట్టు కిట్టు ఎవరు? చివరికి మీనా ఈ వ్యవహారాన్ని తేల్చిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ
నిజానికి ‘విరాటపాలెం’ అనే వెబ్ సిరీస్ వస్తుందనే విషయం కొద్ది రోజుల క్రితం వరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే మేకర్స్ ఈ సిరీస్ ‘రెక్కీ’ అనే వెబ్ సిరీస్ చేసిన టీమ్ నుంచి వస్తుందని అనౌన్స్ చేశారో, ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సిరీస్ మీద పడింది. దానికి మించి ఈటీవీ విన్ ఆరోపణలు రావడంతో అసలు ఈ సిరీస్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సిరీస్‌లో 20 నిమిషాల ఎపిసోడ్‌లు 7 ఉన్నాయి. అయితే, రెగ్యులర్ వెబ్ సిరీస్‌లలో ఒక్కో ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా కట్ చేసి, తర్వాతి ఎపిసోడ్ మీద ఆసక్తి కలిగేలా ఎడిటింగ్ చేస్తారు. ఈ విషయంలో ఈ సిరీస్ మేకర్స్ రెగ్యులర్ టెంప్లేట్‌ను తీసుకోకుండా ముందుకు వెళ్లారు. అయితే కథలో చాలా లోపాలు ఉన్నాయి. ఊరికి అమ్మవారి శాపం అని చెబుతారు, కానీ అసలు అమ్మవారు ఎందుకు శపించిందనే విషయంపై సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఈ సిరీస్ రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది, కానీ పూర్తిస్థాయిలో రైటింగ్ విషయంలో బలం చూపలేకపోయింది. కథ, మ్యూజిక్, ప్రొడక్షన్ విలువలు పర్వాలేదనిపించినా, ‘రెక్కీ’లాంటి మేకర్స్ నుంచి ఆశించే స్థాయి ప్రొడక్ట్ ఇది కాదు. లాజిక్‌కు అందని సీన్స్ చాలా ఉన్నాయి.
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే, అభిజ్ఞ పాత్ర రాసుకున్న తీరు బాగుంది, కానీ ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా రాసుకోవచ్చు. చరణ్ ఉన్నంతలో బాగా నటించాడు. అభిజ్ఞ మొత్తం సిరీస్‌ను తన భుజాల మీద వేసుకుని నడిపించింది. రామరాజు, సురభి ప్రభావతి వంటి సీనియర్ ఆర్టిస్టులు తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, చాలా తక్కువ బడ్జెట్‌లో సిరీస్‌ను పూర్తి చేశామని మేకర్స్ చెబుతున్నారు. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందే. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సిరీస్ నిడివి ప్రధానమైన ప్లస్ పాయింట్.
ఫైనల్లీ
‘విరాటపాలెం’ వన్-టైమ్ వాచబుల్.