Merry Christmas Movie Review: చాలాకాలం తర్వాత విజయ్ సేతుపతి సోలో హీరోగా తెరకెక్కిన సినిమా వెర్రి క్రిస్మస్. బాలీవుడ్ లో పలు పాత్రలు చేస్తూ అక్కడ కూడా పేరు తెచ్చుకున్న విజయసేతుపతి ఈ సినిమాతో ఒకరకంగా బాలీవుడ్ లో కూడా తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు కత్రినా కైఫ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే గాయత్రి ఇద్దరు అతిధి పాత్రలలో నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో ఈ సినిమా హిందీ తమిళ భాషల్లో దొరికేక్కింది ఏక కాలంలో రిలీజ్ చేద్దాం అనుకుని రెండుసార్లు వాయిదా వేసి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. తెలుగులో పెద్ద సినిమాల హడావుడి ఉండడంతో ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు కానీ గుంటూరు కారం హనుమాన్ సినిమాలు తో పాటు జనవరి 12వ తేదీన ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి కత్రినా కైఫ్ నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి అయితే సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
కథ: ఏడేళ్ల జైలు జీవితం గడిపిన ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) బొంబాయిలో తన అంకుల్ యాదోం(రాజేష్) ఇంటికి వెళతాడు. బోర్ కొడుతుందని ఒక రెస్టారెంట్ కి వెళితే అక్కడ అనూహ్యంగా మరియా(కత్రినా కైఫ్) పరిచయం అవుతుంది. ఆమె ఆకర్షణలో పడిన ఆల్బర్ట్ ఆమెను ఫాలో అవుతూ ఆమె ఇంటికి వెళతాడు. ఆమెతో ఫిజికల్ అయ్యే ఉద్దేశంలో ఉండగా బయటికి వెళదామని తీసుకు వెళుతుంది. అయితే వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆమె భర్త సూసైడ్ చేసుకుని పడి ఉంటాడు. అయితే తాను ఇప్పటికే పెరోల్ లో ఉన్నానని ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేనని తన చేతి గుర్తులు అన్నీ చెరిపేసి వెళ్ళిపోతాడు. అయితే తర్వాత కూడా ఏమీ జరగనట్టు మరియా తన కూతుర్ని తీసుకుని చర్చ్ కి వెళ్లడంతో అతనికి అనుమానం వచ్చి ఫాలో అవుతాడు. అక్కడికి వెళ్ళాక మరియా కళ్ళు తిరిగి పడిపోవడంతో రోనీ అనే వ్యక్తి ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం సాయం పట్టమని ఆల్బర్ట్ ను అడుగుతాడు. కార్ ఎక్కాక హాస్పిటల్ కి వద్దు ఇంటికి వెళ్దాం అంటుంది మరియా. సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు అనిపించి ఆల్బర్ట్ ఆలోచనలో పడతాడు. ఆల్బర్ట్ ని దింపేసి రోనీని మళ్ళీ చర్చ్ కు తీసుకు వెళ్తుంది మరియా. ఆల్బర్ట్ వెనక్కి మరియా ఇంటికి వెళ్లి అక్కడి సీన్ చూసి షాక్ అవుతాడు. అసలు అక్కడ ఆల్బర్ట్ ఏమి చూశాడు? మరియా భర్త ఎలా చనిపోయాడు? మరియా ఎందుకు మగవాళ్ళను ఆకర్షించి ఇంటికి తీసుకు వెళుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ: ఫ్రెడరిక్ డా రాసిన ఫ్రెంచ్ నవల లా మోంటే ఛార్జ్ కథ ఆధారంగా ఈ ‘మెర్రీ క్రిస్మస్’ అనే థ్రిల్లర్ రూపొందించబడింది. శ్రీరామ్ రాఘవన్ అన్ని సినిమాలను జాగ్రత్తగా గమనిస్తే, అతని సినిమాల కథకు ఎప్పుడూ స్త్రీయే కేంద్ర బిందువు. సినిమా కథకు హీరోని కేవలం ఒక అలంకారంగా వాడుకుంటారు. ఇక్కడ కూడా అలాంటిదే రిపీట్ అయింది. కత్రినా కైఫ్‌ను శ్రీరామ్ రాఘవన్ ఇప్పటి వరకు ఆమె కెరీర్ లో కనిపించని ఒక పాత్రలో చూపించారు. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ‘మెర్రీ క్రిస్మస్’ బాగా నచ్చుతుంది. నిజానికి కథ నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. అసలు కత్రినా పాత్ర ఏం చేస్తోంది? ఎందుకు ఇలా చేస్తోంది? అనే విషయాలు ప్రేక్షకులకు అనుమానం కలిగిస్తాయి. ముంబయి బొంబాయిగా ఉన్న రోజుల్లో జరిగినట్టు చూపిన ఈ కథలో మొబైల్ లేదు, సోషల్ మీడియా లేదు ఎలాంటి గందరగోళం లేకుండా భలే సస్పెన్స్ మైంటైన్ చేశాడు డైరెక్టర్. ఈ పాత్రలను ఎస్టాబ్లిష్ చేసేందుకు శ్రీరామ్ చాలా టైమ్ తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో, మరియా – ఆల్బర్ట్ హాయిగా సినిమా చూడటం, నగరంలో షికారు చేయడం, మాట్లాడటం, డ్యాన్స్ చేయడం లాంటివి చూసి మీ సహనానికి పరీక్ష పెడుతున్నాడా? ఏంటి? అనిపిస్తుంది. అదే సమయంలో, స్క్రీన్ ప్లేలో చాలా ప్రశ్నలు అపరిష్కృతం అవుతూ వస్తాయి. అయితే చివరి అరగంట సినిమాకి హైలెట్. ఇలాంటి క్లైమాక్స్‌ని మీరు అస్సలు ఊహించరు.
టెక్నీకల్ టీంలో దర్శకత్వం గురించి చెప్పాలంటే శ్రీరామ్ ప్రత్యేకత ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. డార్క్ బ్యాక్ గ్రౌండ్ లో ఆయన చేసే మాయ భలే అనిపించింది. డీటైలింగ్ అయితే భలే అనిపించింది. దానికి తోడు డేనియల్ బి జార్జ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు మధు నీలకందన్ కెమెరా నాస్టాల్జియాతో పాటు అవసరమైన సస్పెన్స్‌ను మెయింటెయిన్ చేశాయి. ప్రీతమ్ అందించిన పాటలు ఉన్నా కానీ గుర్తు పెట్టుకునేలా లేవు. నటన విషయానికొస్తే, విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ తన అమాయకత్వంతో స్క్రీన్ మీద చెలరేగిపోయాడు. మరియా పాత్ర కోసం కత్రినా తన ఎక్స్‌ప్రెషన్స్‌పై మరింత పని చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్‌లో రాజేష్, అశ్విని కల్సేకర్, రాధికా శరత్ కుమార్ చిన్న పాత్రల్లో గుర్తుండిపోయారు.
టాగ్ లైన్: ఒక మంచి ఆఫ్ బీట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అనుకునేవారికి ఈ సినిమా పర్ఫెక్ట్ వాచ్.