NTV Telugu Site icon

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

Sankranthiki Vastunnam Reviee

Sankranthiki Vastunnam Reviee

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. ఆయా ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో ఉంది. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది ? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం

సంక్రాంతికి వస్తున్నాం కథ:
అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అయిన సత్య ఆకెళ్ళ ( అవసరాల శ్రీనివాస్) హైదారాబాద్ వస్తాడు. ఆయన్ని సీఎం కేశవ్(నరేష్), పార్టీ ప్రెసిడెంట్(వీటీవీ గణేష్) మర్యాద పూర్వకంగా కలుస్తారు. సీఎం వద్దంటున్నా వినకుండా పార్టీ ప్రెసిడెంట్ ఆయనకు దావత్ ఇస్తానని ఫామ్ హౌస్ కి తీసుకు వెళ్తాడు. అయితే తన అన్నను జైలు నుంచి తప్పించేందుకు సత్యాను ఓ గ్యాంగ్స్టర్ కిడ్నాప్ చేస్తాడు. సత్యను విడిపించడానికి ఐపీఎస్ మీనాక్షి తన మాజీ ప్రియుడు యాదగిరి దామోదర్ రాజు(వెంకటేష్) అనే మాజీ ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించుతుంది. అప్పటికే పెళ్ళైన రాజు భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్) కూడా వస్తానని పట్టుబడడంతో చివరికి సత్యను విడిపించే ఆపరేషన్ మొదలు పెడతారు. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందా? సత్యను రాజు అండ్ టీం విడిపించిందా? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
సంక్రాంతికి కచ్చితంగా ఈ సినిమా చూడాలి అనేలా ఒక రేంజ్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. ఇక ప్రమోషన్స్ లోనే దాదాపుగా కథ అంతా రివీల్ చేసేసింది సినిమా యూనిట్. అయితే ముందు నుంచి ప్రచారంలో చెప్పిన కథనే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తెరమీదకి తీసుకొచ్చారు. ఫస్ట్ పార్ట్ లోనే ఒక విఐపి కిడ్నాప్ కావడం, అతనిని రక్షించడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేయగల ఒక సమర్థవంతమైన ఆఫీసర్ కోసం వెతుకులాట మొదలుపెట్టడం ఆసక్తికరమపిస్తుంది. తర్వాత ఆ అధికారి ఇంకెవరో కాదు మాజీ పోలీస్ అధికారి వెంకటేష్ అని తెలియడం కథ మలుపు తిరిగిన ఫీలింగ్ అయితే కలుగదు. ఈమేరకు ముందు నుంచే ప్రచారం జరగడంతో వెంకటేష్ ఖచ్చితంగా కథలోకి వస్తాడని తెలుసు కాబట్టి వెంకటేష్ ఇంటికి మీనాక్షి చేరినప్పటి నుంచి అసలు కథ మొదలైన ఫీలింగ్ కలుగుతుంది. ముందు మీనాక్షి వెంకటేష్ ని ఒప్పించి ఆపరేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అనుమానంతో ఐశ్వర్య రాజేష్ తాను కూడా వెంకటేష్ వెంటే ఉంటానని, చెప్పడంతో ఇది ఎలా పాజిబుల్ అవుతుందని ప్రేక్షకులు ఆలోచించేలోపే ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ తో కలిసి వీరంతా ఆపరేషన్ కి బయలుదేరుతారు. సాఫీగా సాగిపోతుందన్న ఆపరేషన్ లో మొదలైన రిస్కులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఇక సరదా సరదాగా ఫస్ట్ హాఫ్ ముగించి సెకండ్ హాఫ్ యాక్షన్ మీద దృష్టి పెట్టాడు డైరెక్టర్. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత ఒక ఎమోషనల్ ఎపిసోడ్ తో సినిమాకి శుభం కార్డు వేశాడు. అయితే సెకండ్ పార్ట్ కి లీడ్ అన్నట్టుగా చివరిలో మరొక చిన్న మెలిక పెట్టాడు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా సాగింది. ఎక్కడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వనివ్వకుండా ఒకపక్క క్రైమ్ ఎలిమెంట్ తో పాటు కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసిన అనిల్ రావిపూడి దాదాపు సక్సెస్ అయ్యాడు. ఇక అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమా అంతా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసేలా అనిల్ రాసుకున్న కామెడీ సెట్ అయింది.

నటీనటుల విషయానికి వస్తే అస్త్ర సన్యాసం చేసిన ఒక మాజీ పోలీసు అధికారిగా వెంకటేష్ ఈ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. గతంలో ఘర్షణ సహ పలు సినిమాలలో పోలీసు అధికారిగా కనిపించిన ఆయన ఈ సినిమాలో మాజీ పోలీసు అధికారిగా ఆకట్టుకున్నాడు.. ఇక ఆయన తర్వాత ఐశ్వర్య రాజేష్ కు మంచి పాత్ర దొరికింది. నటన విషయంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా వెంకటేష్ తో పోటీపడి నటించింది. ఇక మీనాక్షి చౌదరి కూడా ఐశ్వర్యతో పోటీపడి నటించింది అనడంలో సందేహం లేదు.. ఇక ఈ సినిమాలో ఆ తరువాత అంతగా నటించదగ్గ స్కోప్ దొరికిన పాత్రలు వెంకటేష్ కొడుకు పాత్ర చేసిన బుడ్డోడు, వీ టీవీ గణేష్ తో పాటు యానిమల్ సేమ్ ఉపేంద్ర లిమాయోవి. మీరు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక అవసరాల శ్రీనివాస్, సాయికుమార్, పమ్మి సాయి, మురళీధర్ గౌడ్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాకి ప్రధానమైన బలం సంగీతం. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి సంగీతం ప్రధానమైన పాత్ర పోషించింది. సినిమాలో పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా భీమ్స్ మరో హిట్టు కొట్టేశాడు. ఇక డైలాగ్స్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా డైలాగ్స్ తో ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ప్లెజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సినిమాకి లొకేషన్స్ మంచి అందాన్ని తీసుకొచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ అంచనాలు లేకుండా ‘ఈ సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా.

Show comments