Irumudi Review: ఇరుముడి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.5 / 5
- MAIN CAST: Raviteja, Baby Nakshatra, Priya Bhavani Shankar, Sai Kumar, Ajay Ghosh and Others
- DIRECTOR: Shiva Nirvana
- MUSIC: GV Prakash Kumar
- PRODUCER: Mythri Movie Makers
రవితేజ హీరోగా ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించగా, కుమార్తె పాత్రలో కేరళకు చెందిన నక్షత్ర నటించారు. ఇక సాయికుమార్, అజయ్ ఘోష్ వంటి నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఇరుముడి కథ
త్రినాథ్ (రవితేజ) సీలేరు ప్రాంతంలోని పోలూరు అనే ఒక పల్లెలో ట్రక్ ఆటో నడుపుకుంటూ అరటి వ్యవసాయం చేసుకునే వ్యక్తి. అక్కడే అతనికి రెండు ఎకరాల అరటి తోట ఉంటుంది. తన కుమార్తె మణికంఠ /మణెమ్మే(నక్షత్ర) లోకంగా బతుకుతున్న అతను, తమ ఊరిలో ఐదో తరగతి తర్వాత స్కూల్ లేదని ఆమెను స్కూల్ మాన్పించడానికి కూడా సిద్ధమవుతాడు. అంతలా ప్రాణానికి ప్రాణంగా తన కుమార్తెను చూసుకుంటూ, ఊరి వాళ్ళతో చాలా సఖ్యతతో ఉంటాడు. అనునిత్యం మద్యం సేవిస్తూ ఉండే త్రినాథ్, కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి ఆ 41 రోజులు మాత్రం చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. తన కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటాడు.
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ఇక తన ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా, ఆ ఆడపిల్లని తన కుమార్తెగా భావించి ఆ కష్టానికి అడ్డు నిలబడే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తమ గురుస్వామి (సాయికుమార్) కుమార్తె గాయత్రి ఒకరోజు మిస్ అవుతుంది. అయితే అసలు గాయత్రికి ఏమైంది? ఆమెను ఊరి వారంతా త్రినాథ్ సహాయంతో కనిపెట్టారా లేదా? అసలు ఆ ఊరిని వెంటాడుతున్న సమస్య ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాకి ‘ఇరుముడి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు అయ్యప్ప వేషధారణలో ఉన్న రవితేజ ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా వైరల్ అయింది. అలాగే ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌తో పాటు ‘ఇరుముడి’ సాంగ్ కామన్ ఆడియన్స్‌లో సినిమాపై అంచనాలు పెంచాయి. అలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా ప్రారంభమైన కాసేపటి నుంచే త్రినాథ్, అతని ఊరు, కుమార్తెతో అతనికి ఉన్న బాండింగ్ వంటివి ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఆడపిల్ల ఎవరైనా తనకు కూతురు లాంటిదే అనే త్రినాథ్ మైండ్‌సెట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్టాఫ్ అరగంట బాగా వాడుకున్నారు. ఆ తర్వాత ఊరిలో ఏదో ఒక సమస్య ఉంటున్నట్లు చూపిస్తూనే, అసలు సమస్య ఏంటో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఫస్టాఫ్ అంతా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్‌తో, వారి బాండింగ్‌తో సరదా సరదాగా సాగిపోతుంది.
సెకండ్ హాఫ్ మొదలయ్యాక అప్పటివరకు ఉన్న జానర్ షిఫ్ట్ అయినట్లుగా ఒక్కసారిగా థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులను ఎవరూ ఊహించని విధంగా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన క్రూషియల్ ట్విస్టులన్నీ ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోతున్న క్రమంలో, వాటిని లీక్ కాకుండా చూసుకోవడంలో దర్శకుడు మొదటి సక్సెస్ సాధించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా వేగంగా, ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు.
నిజానికి ఇది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో కూడుకున్న కథ కావడంతో, దాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప కథలో ప్రేక్షకుడు లీనమవ్వలేడు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని దర్శకుడు ముందు నుంచే తండ్రీకూతుళ్ల ఎమోషన్, వారి మధ్య బాండ్ క్రియేట్ చేసిన విధానం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా త్రినాథ్ క్యారెక్టర్, ఆడపిల్లల పట్ల అతని అభిప్రాయాలు, తన కూతుర్నే కాదు ఏ ఆడపిల్లనైనా కూతురిగా భావించి కష్టం వస్తే అండగా నిలబడే మనస్తత్వం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంది.
అంతేకాకుండా అయ్యప్ప భక్తులు, కామన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ థియేటర్లలో ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యాక ఒక రకమైన భక్తి మూడ్‌లోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత కథను థ్రిల్ మూడ్‌లోకి నడిపించిన విధానం కూడా సరిగ్గా బ్లెండ్ అయింది. క్లైమాక్స్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులందరూ ఎమోషనల్ అయ్యేలా, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఆలోచనలో పడేలా, కొందరిని కన్నీరు పెట్టించేలా ముగించిన విధానం సినిమాకి చాలా ప్లస్ అయింది.
నటీనటులు విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ కమ్ రైతుగా రవితేజ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకు మాస్ లేదా పోలీస్ పాత్రలలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలోని త్రినాథ్ పాత్రతో సులభంగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా రిలేటబుల్ పాత్ర కావడం అతనికి బాగా కలిసివచ్చింది. కెరీర్లో కచ్చితంగా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కుమార్తె పాత్రలో కనిపించిన నక్షత్ర నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. ఆ పాప తనదైన శైలిలో కొన్ని చోట్ల కళ్లతోనే నటిస్తూ తండ్రితో ఎమోషన్‌ను పండించిన విధానం అభినందనీయం. సాయికుమార్ పాత్ర కూడా చక్కగా కుదిరింది. ప్రియ భవాని శంకర్, అజయ్ ఘోష్ సహా మిగతా పాత్రధారులు కరెక్ట్ గా సెట్ అయ్యారు. జబర్దస్త్ ఫేమ్ కొమరంకి అతని ఇమేజ్ కి భిన్నమైన రోల్ దొరికింది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు శివ నిర్వాణ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, సుత్తి లేకుండా ప్రేక్షకుల మెదడుల్లో ముద్రపడేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సంభాషణలు చాలా సింపుల్‌గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ పాటలతో పాటు నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. సినిమా కోసం ఎంచుకున్న రియల్ లొకేషన్లు కూడా రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడంలో ఉపయోగపడ్డాయి. సినిమా నిడివి కూడా తక్కువగా ఉండడం బాగా కలిసొచ్చింది.
ఫైనల్‌గా ‘ఇరుముడి’ డివోషనల్ టచ్ ఉన్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!