Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్‌కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి, కథ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనుకున్నాను. కానీ కథ నరేట్ చేస్తుంటే ఆమె తన తండ్రి రవితేజను ఆ పాత్రలో ఊహించుకుంటూ విన్నారు. సెకండ్ హాఫ్‌లోని ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ వివరిస్తున్నప్పుడు ఆమె తట్టుకోలేకపోయారు. గొంతు పూడుకుపోయి, కళ్ల వెంట నీళ్లు పెట్టుకుని చేతులు పట్టుకుని ‘స్టాప్ ఇట్ సర్.. ఇది నేను థియేటర్లో చూడలేను’ అని ఏడ్చేశారు” అని శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ఎడిటింగ్ రూమ్‌లో కూడా ఆమె ఈ సినిమాను చూడలేదు. మొన్న చూసిందని తను అని చెప్పారు.
ఈ సినిమాలో రవితేజ హీరోయిజం కంటే పాత్రలోని నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని దర్శకుడు చెప్పారు. ఇంటర్వెల్ ముందు సాధారణ విలన్ చేతిలో రవితేజ దెబ్బలు తినే సన్నివేశం రాసినప్పుడు, ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచించకుండా కథ కోసం ఆయన పూర్తిగా అంగీకరించారని తెలిపారు. అయ్యప్ప స్వామి భిక్ష సన్నివేశాల కోసం షర్ట్ విప్పేందుకు కూడా ఏమాత్రం వెనుకాడలేదని చెప్పారు. సినిమాకు మొదటి ఆడియన్లుగా మైత్రీ ప్రొడ్యూసర్ నవీన్ గారు, రవితేజ మేనేజర్ శ్రీనివాసరాజు కథ వింటూనే కన్నీళ్లు పెట్టుకున్నారని.. కథలోని ఆ బలమైన ఎమోషనే ఈరోజు ‘ఇరుముడి’ని ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టిందని శివ నిర్వాణ పేర్కొన్నారు.
Also Read
- Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
- FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
- Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
- Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
తాజావార్తలు
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
-
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
-
LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!