ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ రోజు (శుక్రవారం) విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అర్జున్ (ఈశ్వర్) ఒకపక్క కాలేజీలో చదువుతూ తన నలుగురు స్నేహితులతో కలిసి జాలీగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జ్యోతి (నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే కావడం కోసం కిషన్ పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్ర పన్నుతాడు. అయితే అర్జున్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరైన శీను అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఆ ఘటన వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? ఉచిత పథకాల వెనక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? అనే విషయం తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఇది ఒక కామెడీ సినిమాగా అనిపించే పొలిటికల్ సెటైర్ సినిమా. ప్రభు�త్వాలు ఉచితాల హామీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి అనే విషయాన్ని చాలా సెటైరికల్‌గా ప్రేక్షకులు కాదనలేని విధంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఒకపక్క కామెడీ తగ్గకుండా మరోపక్క నిజాల్ని చెబుతూ ఈ సినిమా సాగింది. ఒకపక్క కామెడీతో నవ్విస్తూనే మరోపక్క ఆలోచింపచేసే విధంగా ఈ సినిమాని తెరకెక్కించడ టీం సక్సెస్ అయింది.
నటీనటులు:
నటీనటుల విషయానికొస్తే ఈశ్వర్ అర్జున్ పాత్రలో తన యాక్షన్, డాన్స్, ఫైటింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నైనా సర్వర్ జ్యోతి పాత్రలో చక్కగా నటించింది. అందం, అభినయంతో ఆకర్షించింది. అభిమన్యు సింగ్ నరసింహ పాత్రలో ఎప్పటిలాగే చెలరేగిపోయాడు. ఇక సంజయ్ విలన్ కర్ణ పాత్రలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాజేష్, సూర్య, శీను, టోనీ – ఫ్రెండ్స్ పాత్రల్లో కామెడీకి బాగా సపోర్ట్ చేయగా, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి వంటి ఆర్టిస్టులు నవ్వులు పూయించారు.
సాంకేతిక విభాగం:
సాంకేతిక విభాగం పరిశీలన విషయానికి వస్తే ముందుగా కెమెరా వర్క్ విషయంలో అరుణ్ ప్రసాద్ కెమెరా పనితీరు సినిమాకు ప్లస్ అయింది. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా బావుంది. రోషన్ సాలూరి, గౌర హరి ఇచ్చిన సంగీతం బాగా ఆకట్టుకుంది. “మ్యాచింగ్ మ్యాచింగ్” పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలతో సినిమా రూపొందించారు నిర్మాతలు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.
ఫైనల్లీ: ‘సూర్యాపేట జంక్షన్’ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ మెసేజ్.