Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Priyadarshi, Abhinav Gomatam, Chaitanya Krishna, Deviyani, Jordar Sujatha, Pavani Gangireddy, Rohini and Others
- DIRECTOR: Sriraam Eragam
- MUSIC: N. Venkata swamy
- PRODUCER: Mahi v Raghav, Shiva Meka, Sahiti Chintalapudi
తెలుగు ఓటీటీ రంగంలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్రాంచైజీ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు ముచ్చటగా మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మేకర్స్. జియో హాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ లేటెస్ట్ సీజన్, పాత నవ్వులను కంటిన్యూ చేసిందో లేదో ఇప్పుడు సేవ్ ది టైగర్స్ సీజన్ 3 రివ్యూలో చూద్దాం.
సేవ్ ది టైగర్స్ కథ:
గత సీజన్ల గొడవల తర్వాత ముగ్గురు మిత్రుల జీవితాలు మరో మలుపు తిరుగుతాయి. నటి హంసలేఖ (సీరత్ కపూర్) ఇష్యూ ముగిశాక గంటా రవి (ప్రియదర్శి) తన భార్య బలవంతంతో కొత్త గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. ఇటు రాహుల్ (అభినవ్) తనకు నచ్చని ఉద్యోగ భారంతో సతమతమవుతుంటే, అటు విక్రమ్ (కృష్ణ చైతన్య) విడాకుల సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతుంటాడు. తమ వైవాహిక జీవితాల్లో ఎదురవుతున్న ఈ కష్టాలకు స్వర్గలోకపు అధిపతి ఇంద్రుడే (వెన్నెల కిషోర్) కారణమని తాగేసిన ఓ రాత్రి ఈ ముగ్గురూ దేవుడిని గట్టిగా నిలదీస్తారు. ఈ ఫ్రస్ట్రేషన్ విన్న ఇంద్రుడు, వారి సమస్యను పరిష్కరించే బాధ్యతను చిత్రగుప్తుడికి (గుండు సుదర్శన్) అప్పగిస్తాడు. ఒక వింతైన, లైఫ్ ఛేంజింగ్ డీల్‌తో చిత్రగుప్తుడు భూలోకానికి వస్తాడు. అసలు ఆ వింత ప్రయోగం ఏంటి? దానివల్ల ఈ ముగ్గురి సంసారాల్లో ఎలాంటి వింత పరిణామాలు, గందరగోళం చోటుచేసుకున్నాయి? అనేదే ఈ సీజన్ ప్రధాన కథాంశం.
Also Read
విశ్లేషణ
తెలుగు డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ‘సేవ్ ది టైగర్స్’ మూడో సీజన్, ఈసారి సరికొత్త ఫాంటసీ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే పాత నానుడికి తోడు, అప్పట్లో చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ తరహా ఏడు లోకాల కాన్సెప్ట్‌ను కలగలిపి, ఈ సిరీస్‌ను సరికొత్తగా ముస్తాబు చేశారు దర్శకుడు శ్రీరామ్ ఎరగం. బాడీ స్వాపింగ్, రెండు భిన్న లోకాల మధ్య జరిగే డ్రామాతో ఈ సీజన్ మునుపటి కంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
సిరీస్ ప్రారంభంలో మొదటి రెండు ఎపిసోడ్లు పాత్రల ప్రస్తుత పరిస్థితిని, వారి పరిచయాలను చూపించడానికే సరిపోయినా, అసలైన వినోదం మాత్రం మూడో ఎపిసోడ్ నుంచే మొదలవుతుంది. ముఖ్యంగా నాలుగు, ఐదు ఎపిసోడ్లలో రెండు లోకాల మధ్య వచ్చే వైవిధ్యం, అక్కడి సిట్యుయేషన్స్ పుట్టించే నవ్వులు ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలుస్తాయి. మన లోకంలో ఎంతో స్వతంత్రంగా బతికే భార్యలు ఆ మరో లోకంలో బానిసల్లా బతకడం, అలాగే ఇక్కడ చాలా సాఫ్ట్‌గా అమాయకంగా కనిపించే భర్తలు అక్కడ కఠినమైన శాడిస్టులుగా మారిపోవడం అనే పాయింట్ కథలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ వైవిధ్యమైన కాన్సెప్ట్ వల్ల ప్రధాన నటీనటులందరికీ తమలోని రెండు వేర్వేరు కోణాలను (పాజిటివ్, నెగెటివ్ షేడ్స్) చూపించే అద్భుతమైన అవకాశం దొరికింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ఈ డ్యూయల్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో జీవించేశారు. అయితే, వీరందరినీ దాటుకుని క్లైమాక్స్ ఎపిసోడ్‌ను పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది రోహిణి. ఆమె ఇచ్చే ఎంట్రీ, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో పడే విజిల్స్ రేంజ్లో ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇంద్రుడిగా వెన్నెల కిషోర్, గుప్తాగా గుండు సుదర్శన్ తమదైన శైలిలో నవ్వించగా.. గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్ధన్, అభయ్ లాంటి సీనియర్, పేరున్న నటులు తమ పాత్రల పరిధి మేరకు కథను ముందుకు నడిపించారు.
సాంకేతిక విభాగంలో అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇటు కామెడీని, అటు ఎమోషన్‌ను పర్ఫెక్ట్గా క్యారీ చేస్తూ కథకు ప్రాణం పోసింది. విజువల్స్ పరంగా కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది, అలాగే ఎడిటింగ్ కూడా ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్ప్‌గా సాగింది. సంభాషణల విషయానికి వస్తే.. కొన్ని చోట్ల ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టుగా బోల్డ్ మాటలు వినిపించినా, కథాంశం ప్రకారం అవి సరిపోయాయి. కేవలం నవ్వించడమే కాకుండా, అంతర్లీనంగా సరైన పేరెంటింగ్ విధానం, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఒక మంచి సందేశాన్ని కూడా ఈ సిరీస్ ద్వారా సున్నితంగా సమాజానికి అందించారు.
ఫైనల్లీ ఈ వీకెండ్లో సరదాగా నవ్వుకోవడానికి ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ .
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!