NTV Telugu Site icon

SPY Movie Review: నిఖిల్ సిద్దార్థ్ ‘స్పై’ మూవీ రివ్యూ

Spy Movie Review

Spy Movie Review

SPY Movie Telugu Review: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ ఆ తర్వాత 18 పేజెస్ అనే సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. అలాంటి ఆయన హీరోగా స్పై అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడేలా చేసింది. దానికి తోడు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం, రానా ఒక గెస్ట్ రోల్ లో నటించడంతో సినిమాకి మరింత బూస్ట్ అయింది. గ్యారీ బీహెచ్ డైరెక్షన్లో, రాజశేఖర్ రెడ్డి కథ అందిస్తూ నిర్మించిన ఈ సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథ:
జై(నిఖిల్) ఇండియాకి చెందిన రీసెర్చ్ అనాలసిస్ వింగ్-రాకి చెందిన ఒక ఏజెంట్. ఇండియా కోసం ఏమి చేయడానికి అయినా సిద్ధమయ్యే అతనికి గ్లోబల్ టెర్రరిస్ట్ ఖదీర్ ఖాన్‌(నితిన్ మెహతా)ని ట్రేస్ చేసి అంతమొందించే పని అప్పచెబుతారు. ఖదీర్ ఖాన్‌ని ఐదు సంవత్సరాల క్రితం చంపిన తరువాత అదే మిషన్‌లో మరణించిన తన సోదరుడు సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేష్)ని ఎవరు చంపారు? ఖదీర్ ఖాన్‌ ఎక్కడ ఉన్నాడు? అని వెతుకుతూ జై బయలుదేరతాడు. అయితే ఇదిలా ఉండగా రా హెడ్ క్వార్ట్రర్స్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ మిస్ అవుతుంది. ఈ క్రమంలో అసలు జై సుభాష్ ను చంపింది ఎవరు అనేది తెలుసుకున్నాడా? ఖదీర్ ఖాన్‌ ను ట్రేస్ చేశాడా? నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ ని వెనక్కు తెచ్చాడా? అనేదే సినిమా కథ.

Samajavaragamana Review: ‘సామజవరగమన’ రివ్యూ

విశేషణ:
ఇప్పటివరకు టాలీవుడ్లో పలు సినిమాలకి ఎడిటర్ అయిన గ్యారీ ఈ స్పైతో దర్శకుడిగా మారాడు. సినిమా టైటిలే స్పై కాబట్టి ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఈ సినిమా కూడా ఉగ్రవాదానికి సంబంధించిన ప్లాట్‌తో భారతీయ RAW ఏజెన్సీ నేపథ్యంలో రాసుకున్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో స్పై థ్రిల్లర్‌లు తరచుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొంచెం శ్రద్ధ పెట్టి మంచి లైన్ కనుక తీసుకునే ఈ స్పై థ్రిల్లర్ లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. అయితే ఏమాత్రం ఫోకస్ తప్పినా అది సినిమాకే పెనుముప్పుగా మారుతోంది. ఇక ఈ సినిమా విషయంలో కూడా రాసుకున్న కథ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం తడబడినట్టు అనిపించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అన్న, అన్న బాటలోనే వెళ్లిన తమ్ముడు అన్న చావుకు ఎలా పగ తీర్చుకున్నాడు అనే లైన్లో గతంలో కూడా కొన్ని చూశాం. ఈ సినిమా కూడా అదే లైన్లో సాగుతూ వెళ్ళింది, దానికి నేతాజీ మృతి అనే అంశాన్ని యాడ్ చేశారు. అయితే వీరు అనుకున్న మొదటి పాయింటే కన్విన్సింగ్ అనిపించలేదు. అన్నా తమ్ముళ్ల ఎమోషన్ ను క్యారీ చేయలేక పోయారు. ఎందులోనూ డిటెయిలింగ్ లేకపోవడంతో కట్టే కొట్టె తెచ్చే అన్నట్టు సాగిపోతూ వెళ్ళింది. సుభాష్ చంద్రబోస్ కోణం కనుక లేకుంటే ఇంతకు ముందే ఈ సినిమా చూసేశామే అని కూడా అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ లో ట్విస్ట్ సినిమా మీద కొంత ఆసక్తిని కలిగిస్తుంది. రానా ఎంట్రీ అదిరింది అనుకునే లోపే ఆయన సీన్ ముగుస్తుంది. థ్రిల్లర్ అంటే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారు:
ముందుగా నటీనటుల విషయానికి వస్తే నిఖిల్ ఈ సినిమాలూ స్పై ఏజెంట్‌గా కనిపించాడు. మేకోవర్ మినహా ఈ సినిమాలో డీ లాంగ్వేజ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఆయన తన పార్ట్ విజయవంతంగా పూర్తి చేశాడు. నిఖిల్‌కి ఈ సినిమాలో చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అందులో ఆయన రాటుదేలినట్టు అనిపించింది. ఇక హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్ కి మంచి స్కోప్ ఉన్న రోల్ దక్కింది. ఇక ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, తనికెళ్ల భరణి, జిషు సేన్‌గుప్తా, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమతం, సచిన్ ఖేడేకర్, సన్యా ఠాకూర్, పోసాని కృష్ణ మురళి, పృధ్వి, రవివర్మ అలాగే రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించినా ఎవరినీ పూర్తిస్థాయిలో వాడుకోలేదు ఏమో అనిపించింది. మకరంద్ దేశ్‌పాండే సినిమాలో కీలకమైన పాత్ర పోషించగా అభినవ్ గోమతం కామెడీ కూడా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే టాలెంటెడ్ ఎడిటర్, గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారడంతో ఎడిటింగ్ టేబుల్ మీద కూడా గ్రిప్ ఉంటుంది కాబట్టి మాంచి స్పై థ్రిల్లర్‌ని అందిస్తాడని ఆశించారు అందరూ. ఈ సినిమాలో ఎడిటింగ్ వరకు బాగుంది కానీ డైరెక్షన్ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. ఓపెనింగ్ హాఫ్ అక్కడక్కడ డీసెంట్ మూమెంట్స్‌ ఉన్నా రెండో హాఫ్ గందరగోళంగా అనిపిస్తుంది. నేతాజీ ట్రాక్‌ని కన్విన్సింగ్ గా చూపించడంలో తడబడ్డారు. ఈ తరహా థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్‌ప్లే క్రిస్ప్‌గా, కుర్చీలకు అతుక్కుని కూర్చునేలా చేయాలి. అయితే తక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ సినిమా ఎందుకో సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేదు, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ పనితనం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది, విజువల్ ప్రెజెంటేషన్ రిచ్ గా, చాలా వైబ్రెంట్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మీద మరింత వర్కౌట్ చేయించి ఉండాల్సింది.

ప్లస్ పాయింట్స్
రన్ టైమ్
సుభాష్ చంద్రబోస్‌ ఎపిసోడ్
ఫైట్స్
నిఖిల్
విజువల్స్

మైనస్ పాయింట్స్
మిస్సయిన థ్రిల్
ఊహించదగిన కథనం

బాటమ్ లైన్ : థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది, కొన్ని లోపాలున్నా ఓవరాల్ గా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది.

Show comments