Naga Bandham Review : నాగబంధం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Virat Karna, Nabha Natesh, Jagapatih Babu, Garuda Ram and others
- DIRECTOR: Abhisek Nama
- MUSIC: Junaid, Abhi
- PRODUCER: NIshitha, Kishore
స్టార్ క్యాస్ట్ లేదు, స్టార్ డైరెక్టర్ కాదు, అయినా సరే విజువల్స్‌తో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘నాగబంధం’. ట్రైలర్ రిలీజ్ అయ్యాక, ఈ సినిమా మీద అప్పటివరకు ఉన్న అంచనాలన్నీ మారిపోయాయి. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్గా రూపొందించిన చిత్రం ‘నాగబంధం’. భారీ అంచనాలతో రూపొందించబడిన ఈ సినిమా, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒకరోజు ముందుగానే మీడియాకి స్పెషల్ ప్రీమియర్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అని ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
నాగబంధం కథ:
మరణాన్ని జయించే అద్భుత శక్తి కలిగిన ‘బ్రహ్మకమలం’ చుట్టూ తిరిగే కథ ఇది. 1962 కాలంలో పురావస్తు ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్ (జగపతిబాబు) ఎన్నో పరిశోధనలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయనకు రహస్య గ్రంథం ద్వారా అనంత పద్మనాభస్వామి దేవాలయంలోని విష్ణువు వద్ద ఉన్న బ్రహ్మకమలం గురించి తెలుస్తుంది. సృష్టిని శాసించాలనుకునే విలన్ అలీ (రిషబ్ సహానీ) ఆ బ్రహ్మకమలాన్ని దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతాడు. మరోవైపు, చెల్లి ప్రాణంగా బతికే రుద్ర (విరాట్ కర్ణ) పెళ్లి రోజున అలీ పెద్ద విధ్వంసం సృష్టిస్తాడు. రుద్ర కుటుంబ సభ్యులను దారుణంగా ఊచకోత కోస్తాడు. అదే సమయంలో రుద్ర ప్రేమించిన పార్వతి (నభా నటేష్) కూడా అతడికి వెన్నుపోటు పొడుస్తుంది. అసలు ఆ బ్రహ్మకమలానికి, నాగబంధం రహస్యానికి ఉన్న లింక్ ఏంటి? అలీ అనుకున్నది సాధించాడా? తన కుటుంబాన్ని పోగొట్టుకున్న హీరో వీరందరినీ ఎలా ఎదిరించాడు? అనేదే మిగతా సినిమా.
Also Read
విశ్లేషణ:
నాగబంధం టీజర్, ట్రైలర్లు వచ్చేసరికి అంచనాలు ఆకాశాన్నంటాయి. సూపర్ స్టార్స్ ఎవరూ లేకపోయినా, భారీ బడ్జెట్‌తో అదిరిపోయే సెట్స్, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇమేజ్‌తో డివోషనల్ థ్రిల్లర్ అని బాగా ప్రచారం చేశారు. దీంతో సినిమా మీద భారీ హైప్ వచ్చింది. ఇక ఫస్ట్ హాఫ్ పూర్తిగా 1962లోనే సాగుతుంది. బ్రహ్మకమలం, నాగబంధం కోసం వివిధ వ్యక్తులు చేసే ప్రయత్నాలు, రుద్ర కుటుంబం అంటూ కథ ముందుకు పోతుంది. ఇంటర్వెల్ దగ్గర యాక్షన్, ఎమోషన్స్ కలిసిన ఒక ట్విస్ట్ ఇచ్చి, తర్వాత రుద్ర ఏం చేస్తాడన్న ఉత్కంఠను మిగిల్చారు. సెకండ్ హాఫ్‌లో రుద్ర బ్రహ్మకమలం వెతుక్కుంటూ వెళ్తూ కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుంటాడు, ఊహించని ట్విస్టులు బాగున్నాయి. ఇక్కడి నుంచి కథ దాదాపు 1756లోకి మారి, అదే బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి, డివోషనల్ ఎలివేషన్ కూడా ఇచ్చారు.
విజువల్స్ బాగా పని చేశాయి. ప్రతి ఫ్రేమ్ రంగులతో నిండుగా కనిపిస్తుంది. కొన్ని షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రంగనాథ స్వామి విగ్రహం అయితే తిరువనంతపురం పద్మనాభ స్వామిని గుర్తు చేస్తుంది. ఆలయం డిజైన్ కూడా శ్రీరంగం స్టైల్లో ఉండటం ఆకట్టుకుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల కథ సాగదీసినట్టు అనిపించింది. హీరో బంధువులుగా వచ్చే అనసూయ ఫ్యామిలీ ట్రాక్ కథకు పెద్దగా ఉపయోగం లేకపోయినా, ఆ సీన్స్‌తో సమయం తీసుకున్నారు. సీరియస్ మూడ్ వచ్చాక అక్కర్లేని రొమాంటిక్ సాంగ్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. రొటీన్ స్టోరీ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ మరింత బలంగా ఉంటే ఇంకా బాగుండేది.
సెకండ్ హాఫ్ మొదట్లో నాగబంధం, బ్రహ్మకమలం వెనక ఎవరు ఉన్నారన్న ట్విస్టులు బాగా ఉన్నాయి. 1756 సీన్స్ కూడా ఆకర్షణీయంగా తీశారు. క్లైమాక్స్ యాక్షన్‌తో పాటు భక్తి టచ్ ఇచ్చి ముగించారు. సినిమా మొత్తం మీద AIని చాలా సమర్థవంతంగా వాడారు. ఎమోషన్స్ ఇంకా గట్టిగా పండించి ఉంటే సినిమా మరింత పైకి వెళ్లేది. డివోషనల్ థ్రిల్లర్ అని ప్రమోట్ చేసినా, ఆ అంశాన్ని పూర్తి ఫోకస్‌తో నడపలేదు. సనాతన ధర్మం గురించి డైలాగ్స్‌లో రెండు మూడు సార్లు చెప్పారు కానీ, కథలో ఆ భావనను సహజంగా చూపించలేదు. ప్రమోషన్స్‌లో ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ అని, అనంత పద్మనాభ స్వామి అని చెప్పడంతో ట్రెజర్ హంట్ టైపు సినిమా అని ఊహించుకొని వెళ్తే, కథలో అంత స్కోప్ ఉన్నా కొన్ని అనవసర ట్రాకులు, డైలాగ్స్‌తో సాగించేశారు. ముఖ్యంగా నాగబంధం వెనక ఏముందన్న విషయం సినిమా అంతా నడిపించి చివరికి ఏమీ చెప్పకుండా ముగించేశారు. అది తెలుసుకోవాలంటే పార్ట్-2 కోసం వేచి ఉండాల్సిందే. ఈ కథని కాస్త టైట్‌గా ఎడిట్ చేసి, సస్పెన్స్‌ని మరింత పెంచి ఉంటే ఇంకా బాగుండేది. మొత్తం మీద చూస్తే, చిరంజీవి ‘అంజి’ సినిమాతో పాటు ఇతర డివోషనల్ థ్రిల్లర్లు గుర్తుకు వచ్చేస్తాయి. విజువల్స్, ట్విస్టులు, స్కేల్ బాగున్నా కథను మరింత దృఢంగా, ఎమోషన్స్‌తో నడిపిస్తే ఇంకా బెటర్ గా ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే రుద్ర పాత్రలో విరాట్ కర్ణ నటన చాలా బాగుంది. ఒక సాధారణ యువకుడిగా, సాధువుగా రెండు విభిన్న షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లలో మెప్పించినా, ఇంతటి భారీ స్కేల్ ఉన్న సినిమాను ఒంటిచేత్తో నడిపించే ఇమేజ్ అతనికి ఇంకా రాలేదనిపిస్తుంది. ద్విపాత్రాభినయంతో నభా సర్ప్రైజ్ చేసింది, ఆమె పాత్ర చుట్టూ ఉన్న ట్విస్ట్ బాగుంది. ఆర్కియాలజిస్ట్‌గా జగపతిబాబు అనుభవం సినిమాకు ప్లస్ కాగా, బైరాగి పాత్రలో గరుడ రామ్ తన విలక్షణ నటనతో భయపెట్టాడు. విలన్‌గా రిషబ్ సహానీ క్రూరత్వాన్ని బాగా పండించాడు. అనసూయ, ఐశ్వర్య మీనన్, మురళీ శర్మ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే జునైద్ కుమార్, అభిషిక్త్, కొత్తపల్లి అందించిన పాటలు, నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సౌందర్ రాజన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది, ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండియర్‌గా, రిచ్‌గా విజువలైజ్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నా, మరికొన్ని సీన్లలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. దర్శకుడు అభిషేక్ నామా మేకింగ్ పరంగా, బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కానీ స్క్రీన్‌ప్లే లోపాలు, కథలో స్పష్టత లేకపోవడం వల్ల డైరెక్టర్‌గా కొంత తడబడ్డాడు.
ఫైనల్లీ: ‘నాగబంధం’ – విజువల్ గ్రాండియర్ విత్ ఎంగేజింగ్ మూమెంట్స్!
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!