M4M Movie Review : ‘ఎం4ఎం’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎం.ఆర్.సి. వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ తదితరులు
- DIRECTOR: మోహన్ వడ్లపట్ల
- MUSIC: వసంత్ ఇసైపెట్టై
- PRODUCER: మోహన్ వడ్లపట్ల
క్రిమినల్ మైండ్స్, సైకో కిల్లర్స్ చుట్టూ తిరిగే కథలకు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఓ పుస్తకంలో రాసినట్లుగానే వరుస హత్యలు జరిగితే ఎలా ఉంటుంది? ఆ శవాలతో హంతకుడు ఓ ఆర్ట్ వేస్తే? ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ (Motive for Murder). గతంలో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజే (మే 8న) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ఆడియన్స్‌ను ఏ మేరకు థ్రిల్ చేసిందో రివ్యూలో చూద్దాం.
ఎం4ఎం కథ:
హైదరాబాద్‌లో ఓ స్టార్ హీరో దారుణ హత్యకు గురవుతాడు. అయితే ఆ కిల్లర్ మామూలోడు కాదు.. శవాన్ని జీన్ సైమన్ వేసిన ‘డెత్ ఆఫ్ గ్లాడియేటర్’ అనే ప్రసిద్ధ పెయింటింగ్ పొజిషన్‌లో ఉంచి వికృతానందం పొందుతాడు. ఈ హై ప్రొఫైల్ కేసును ఛేదించే బాధ్యతను ప్రభుత్వం ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య)కు అప్పగిస్తుంది. కృష్ణ భార్య రాధ (జో శర్మ) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. కృష్ణ దర్యాప్తులో గడిచిన ఐదేళ్లలో అచ్చం ఇలాగే 20కి పైగా హత్యలు జరిగాయని తేలుతుంది. అయితే, రచయిత వాసుదేవ్ (ఎం.ఆర్.సి వడ్లపట్ల) రాసిన, కోర్టు నిషేధించిన ‘ఎం4ఎం’ అనే పుస్తకంలోని సంఘటనల తరహాలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని రాధ పసిగడుతుంది. ఆ పుస్తక రచయితను కలిసిన రాధకు.. హంతకుడి బారి నుంచి తృటిలో తప్పించుకుని గతాన్ని మర్చిపోయిన ఫాల్గుణ (శుభలేఖ సుధాకర్) అనే దర్శకుడి ద్వారా ఓ కీలకమైన క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ఏంటి? భార్య రాధ సాయంతో ఏసీపీ కృష్ణ ఆ సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు? ఈ ఆర్టిస్టిక్ మర్డర్స్ వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటి? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
సీరియల్ కిల్లింగ్స్, సైకోపాత్ హంతకులను పట్టుకునే కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో బాషలలో ఓటీటీల్లో, సిల్వర్ స్క్రీన్ మీద కోకొల్లలుగా సినిమాలు వచ్చాయి. ఒక క్రైమ్ నవల ఆధారంగా హత్యలు జరగడం అనే పాయింట్ కూడా పాతదే. అయితే, ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న ‘శవాలను పాపులర్ పెయింటింగ్స్ తరహాలో మార్చడం’ అనే పాయింట్ కాస్త కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో క్రియేట్ అవుతుంది. అయితే, సినిమాను చాలా పరిమితమైన బడ్జెట్‌తో తెరకెక్కించారనే విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా రాజీ పడకుండా ఉండి ఉంటే అవుట్‌పుట్ ఇంకాస్త బెటర్‌గా వచ్చేదనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన జో శర్మకు ఇదే తొలి చిత్రమైనప్పటికీ, ఎంతో అనుభవం ఉన్న నటిలా తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఏసీపీ కృష్ణ పాత్రలో హీరో సంబీత్ ఆచార్య నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. శుభలేఖ సుధాకర్, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. ‘మల్లెపువ్వు’, ‘మెంటల్ కృష్ణ’ లాంటి సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల.. దర్శకుడిగా తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వేయించుకున్నారు. ఇక వసంత్ ఇసైపెట్టై బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంతోష్ షణ్మోని కెమెరా వర్క్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగాయి.
చివరిగా : మర్డర్ మిస్టరీలను, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులను ఒక మోస్తరుగా ఆకట్టుకుంటుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్లపట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!