Love Insurance Kompany Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Pradeep Ranganathan, Krithi Shetty, Seeman, Sj Suryah and Others
- DIRECTOR:
- MUSIC:
- PRODUCER: Vignesh Shivan, Nayanthara, Lalit Kumar
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ: వరుసగా మూడు సినిమాలు చేసి, ఆ మూడు సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టి, సక్సెస్ఫుల్ హీరోగా ముద్ర వేసుకున్నాడు ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఆయన, తర్వాత తాను చేస్తున్న అన్ని సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని తెలుగులో కూడా టీమ్ వచ్చి ప్రమోట్ చేసింది, దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఓ రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తెలుగులో ‘డెకాయిట్’ తో పోటీ పడుతూ ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రివ్యూలో చూద్దాం.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ కథ
2040లో చెన్నైలో జరుగుతున్న కథగా ఈ కథను చూపించారు. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాగా, సూర్య (ఎస్.జె. సూర్య) డెవలప్ చేసిన ‘ఎల్ఐకే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే ఒక యాప్ భారతదేశ యువత మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. “ప్రేమకు ఇన్సూరెన్స్” అంటూ మొదలైన ఈ యాప్, నెమ్మదిగా యువత ఆలోచనలను సైతం హైజాక్ చేసేలా ప్రభావితం చేయడం మొదలుపెడుతుంది. అయితే ‘ఆర్గానిక్ విలేజ్’ అంటూ ఈ ఫోన్ అడిక్షన్ వదలగొట్టడానికి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ నడిపే సీమాన్ కుమారుడైన వాసు (ప్రదీప్ రంగనాథన్), మొదటి చూపులోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధీమా (కృతి శెట్టి)తో ప్రేమలో పడతాడు. క్షణం కూడా ఫోన్ వదలని ధీమాతో అసలు ఫోన్ కి ఆమడ దూరం పరిగెత్తే వాసు ఎలా ప్రేమలో పడ్డాడు? చివరికి వీరి ప్రేమకు ‘ఎల్ఐకే’ యాప్ ఎలా అడ్డుపడింది? ఆ అడ్డుని తొలగించుకుని వీరు ప్రేమలో ఒకటయ్యారా లేదా? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
సాధారణంగా ప్రదీప్ రంగనాథన్ సినిమాలు యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ‘లవ్ టుడే’ మొదలు ‘డ్యూడ్’ చూసుకున్నా, అంతకు ముందు వచ్చిన ‘డ్రాగన్’ చూసుకున్నా, ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఎంచుకుని దాని చుట్టూనే కథ తిప్పుతూ ఉంటాడు. దాదాపుగా ఈ సినిమా కూడా అలాగే సాగుతుంది. అయితే ఈ సినిమా కథలో ప్రదీప్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలియదు కానీ, విఘ్నేష్ శివన్ రాసుకున్న కథ కొంత రిలేటబుల్ గానే అనిపించింది. సినిమా మొత్తం 2040లో జరుగుతున్నట్లు చూపించినా కూడా, ఇప్పటి ఎన్నో సంఘటనలను ఎత్తి చూపించేలా ఈ కథ ఉంటుంది. నిజానికి ఫోన్ ఈరోజు నిత్యవసర వస్తువు అయిపోయింది, అనుక్షణం ఫోన్ తోనే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి ఫోన్ మనుషుల్ని కంట్రోల్ చేసే పరిస్థితులకు కచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుందేమో అని అంచనాలు ఎప్పటినుంచో ఉన్నాయి, బహుశా దాన్నే ఒక ఆసక్తికరమైన లైన్ గా రాసుకున్నట్టున్నాడు దర్శకుడు.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ లవ్ కి కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తికరమైన లైన్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఎక్కడో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి విఘ్నేష్ శివన్ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి, అయితే ఈ సినిమా మాత్రం ఆ విషయంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయింది. ఎందుకంటే ఫస్టాఫ్ అంతా కూడా కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా, మెయిన్ కాన్ఫ్లిక్ట్ మాత్రం సెకండ్ హాఫ్ లోనే పెట్టుకున్నారు. కానీ ఫస్టాఫ్ ఏ ఆసక్తికరంగా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎందుకో ఎక్కువగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఇక క్లైమాక్స్ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించింది. అక్కడక్కడా ఎస్.జె. సూర్య, ప్రదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వించాయి తప్ప, మిగతా సన్నివేశాలు ఏవీ పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు. నిజానికి ఇది కథగా రాసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేలా అనిపించి ఉండవచ్చు కానీ, ఎగ్జిక్యూషన్ లో మాత్రం పూర్తిస్థాయిలో తేడా కొట్టింది.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. తనకు బాగా అలవాటైన తరహా పాత్రలో మెరిశాడు. ఎస్.జె. సూర్య సైతం తనకు బాగా అలవాటైన తరహా పాత్రలోనే ఆకట్టుకున్నాడు. ఇక కృతి శెట్టి పర్వాలేదనిపించింది, మేకప్ విషయమో ఏమో తెలియదు కానీ ఆమె ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్కలాగా కనిపించింది. కాస్త ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సీమాన్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, తెలుగు డబ్బింగ్ పూర్తిస్థాయిలో చెడగొట్టారు. అక్కడక్కడా తెలుగువారికి కనెక్ట్ అయ్యే పంచులు రాసుకున్నా సరే, ఎందుకో అనవసరమైన ప్రయోగాలు చేశారేమో అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా: ఈ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విఘ్నేష్ అలానే ప్రదీప్ మార్క్ సినిమా ఏమాత్రం కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే నచ్చొచ్చు.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!