‘Gaayapadda Simham’ Movie Review: గాయపడ్డ సింహం మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు, ఫరియా అబ్దుల్లా,మానస చౌదరి
- DIRECTOR: కశ్యప్ శ్రీనివాస్
- MUSIC: స్వీకర్ అగస్తి
- PRODUCER: భాను ప్రతాప, పవన్ సాదినేని, కళ్యాణ్ చక్రవర్తి, ఉమేష్ కుమార్ బన్సల్
దర్శకుడు పవన్ సాదినేని సమర్పణలో, కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో, తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. శ్రీ విష్ణు ఎక్స్టెండెడ్ కామియోలో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, సహా జీడీ చక్రవర్తి కీలక పాత్రలలో నటించారు. ‘ట్రంప్’ పేరుతో ముందు నుంచి ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులలోకి బాగానే చొచ్చుకు వెళ్ళింది. ఎట్టకేలకు ఈ సినిమాను మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
గాయపడ్డ సింహం కథ:
దరహాస్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాయి గాయత్రి (మానస చౌదరి)తో ప్రేమలో ఉన్న అతను, పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం వెళ్లి, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే అమెరికా వెళ్లాలనే ఆమె తండ్రి కండిషన్ విని షాక్ అవుతాడు. కొంచెం కష్టమైనా ప్రయత్నించి అమెరికా వెళ్ళిన అతనికి, ట్రంప్ తీసుకొచ్చిన నూతన పాలసీల కారణంగా పెద్ద షాక్ తగులుతుంది. అతడిని ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. అయితే, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన అతనికి ప్రేయసి బ్రేకప్ చెబుతుంది. దీంతో అతను మానసిక సంఘర్షణకు లోనై, ఒక మెంటల్ ప్రాబ్లం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికంతటికీ ట్రంప్ కారణమని భావించి, చేతబడి చేసి తనని అంతమొందించాలని భావిస్తాడు. మరి ట్రంప్ మీద దరహాస్ పగ తీర్చుకున్నాడా? ట్రంప్ మీద చేతబడి పారిందా? అసలు ఈ కథలో సత్యా లాజిస్టిక్స్ ఎండీ సత్య (జీడీ చక్రవర్తి) పాత్ర ఏమిటి? అతని జీవితంలోకి వచ్చిన ఫరియా అబ్దుల్లా పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు లేదా పొలిటికల్ సెలబ్రిటీలను మెయిన్ సెంటర్‌గా పెట్టుకుని కొన్ని సినిమాలు రాసుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే ఈ సినిమాను కూడా ట్రంప్ ఆధారంగా చేసుకుని ఒక కథ రాసుకున్నారు. జర్నలిస్ట్ అయిన సూర్యప్రకాశ్ జ్యోతుల అందించిన కథకు, కశ్యప్ శ్రీనివాస్ తనదైన స్క్రీన్ ప్లేతో తెరమీదకు ఎక్కించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సిట్యుయేషన్ కామెడీ చాలా చోట్ల వర్కవుట్ అయింది. కొన్నిచోట్ల కావాలని చేసిన కామెడీ పండలేదు కానీ, సిట్యుయేషన్ కామెడీ బాగా కుదిరింది.
ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ‘సలార్’ స్టైల్ నరేషన్ ఇస్తూ సాగిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో చాలా చోట్ల ఇతర సినిమాల రిఫరెన్స్‌లు బాగున్నాయి; వాటిని నటీనటులు ప్రజెంట్ చేసిన తీరు కూడా బాగా వర్కవుట్ అయింది. ఓవరాల్‌గా చూసుకుంటే, ఈ సినిమాకి మంచి స్టోరీ కుదిరింది కానీ, ఎగ్జిక్యూట్ చేసే విషయంలో అక్కడక్కడ పొరపాట్లు జరిగినట్లు అనిపించింది. కానీ నటీనటులు తమదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కామెడీ పండిస్తూ నవ్వించారు. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతూనే, సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచారు. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక శ్రీ విష్ణు పాత్రతో కథ నడిపిస్తూ సినిమా మీద మరింత ఆసక్తి పెంచారు. నిజానికి చూడ్డానికి సిల్లీగా అనిపించే విషయాన్ని హీరో సీరియస్‌గా తీసుకోవడంతోనే అసలు కథ వర్కవుట్ అయ్యేలా దర్శకుడు రాసుకున్నాడు. అయితే ఇలాంటి సిల్లీ కథలో చేతబడి లాంటి అంశాలను చూపించడం ద్వారా దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. నిజంగా చేతబడి పనిచేస్తుందా లేదా అనే విషయాలను స్పష్టంగా ప్రస్తావించకుండానే కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. కథ బాగున్నప్పటికీ, కథనంలో వేగం లోపించడంతో పాటు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కొంతవరకు ఇబ్బంది పెట్టే అంశమే.
నటీనటుల పనితీరు:
తరుణ్ భాస్కర్ తన ‘దరహాస్’ పాత్రలో అదరగొట్టాడు. అతనికి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు కాబట్టి సునాయాసంగా నటించేశాడు. అతని స్నేహితుడి పాత్రలో నటించిన దర్శకుడు కశ్యప్ కూడా కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. రాబోతున్న సీక్వెల్‌కి ఇది ఒక రకంగా ఎంట్రీ కార్డు లాంటి సినిమా అనే చెప్పాలి. శుభలేఖ సుధాకర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి వంటి వాళ్ళు చిన్న పాత్రల్లో కనిపించినా, ఉన్నంతలో మెప్పించారు.
సాంకేతిక వర్గం:
రచయిత రాసుకున్న కథ బాగుంది కానీ, దర్శకుడు కశ్యప్ దానిని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో కొంతవరకు తడబడ్డాడు. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు; ఒక్కో సాంగ్ అయితే స్పీడ్ బ్రేకర్ అనే ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి; సినిమా కోసం గట్టిగానే ఖర్చు పెట్టారనిపిస్తోంది.
ఫైనల్‌గా: ఈ ‘గాయపడ్డ సింహం’ సిల్లీ కామెడీతో నవ్విస్తుంది!
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!