Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాతల కాలం నాటి ఆస్తులు.., వందేళ్ల సంప్రదాయాలు.., దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి టాటా గ్రూప్‌లో ఇప్పుడు ఒక కొత్త యుద్ధం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు తెరవెనుక ఉన్న వివాదాలు ఇప్పుడు బజారున పడ్డాయి. ఒకవైపు దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దూరదృష్టి.., మరోవైపు ఆయన వారసత్వ పోరులో వస్తున్న కొత్త మలుపులు… టాటాల కీర్తి ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి. తాజాగా రతన్ టాటా సోదరుడు జిమ్మీ టాటా రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. అసలు జిమ్మీ టాటా రాసిన లేఖలో ఏముంది? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన, ఇప్పుడే ఎందుకు లేఖ రాశారు..? టాటాల మహా సామ్రాజ్యం వెనుక ఏం జరుగుతోంది?
టాటా సన్స్ బోర్డుకు, టాటా ట్రస్టులకు మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో ఉన్నా… రతన్ టాటా మరణం తర్వాత ఇది మరింత ముదిరింది. తాజాగా జిమ్మీ టాటా లెటర్ తో ఇది మరింత ముదిరింది. రతన్ టాటాకు జిమ్మీ టాటా సొంత సోదరుడు. ప్రస్తుత టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాకు సవతి సోదరుడు. సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో జిమ్మీ టాటా ట్రస్టీగా ఉన్నారు. టాటా సన్స్ బోర్డులో ఈయనకు 0.81శాతం వాటా ఉంది. అయితే గత పదేళ్లుగా జిమ్మీ టాటా.. బోర్డు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.
సుదీర్ఘకాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న జిమ్మీ టాటా.. ఇప్పుడు ట్రస్టుల నిర్వహణపై అనేక ఆరోపణలు చేశారు.టాటా ట్రస్టుల నిర్వహణ విధానమే మొదట్నుంచి తప్పుల తడకగా ఉందని జిమ్మీ టాటా ఆరోపించారు. సర్ రతన్ టాటా, సర్ దోరాబ్జీ టాటాలకు పిల్లలు లేరు. అందుకే వాళ్ళు తమ ఆస్తులన్నింటినీ దేశ ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం రాసిచ్చారు. ఆ ట్రస్టులు ఎప్పటికీ ఏ ఒక్కరి ప్రైవేట్ ఆస్తులు కాకూడదని, కేవలం ప్రజల కోసమే పనిచేయాలని కోరుకున్నారు. కానీ, కొంతకాలంగా ప్రస్తుత టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా తన కుటుంబ సభ్యులను, పిల్లలను ట్రస్టుల్లోకి తెస్తున్నారు. టాటా సన్స్‌పై ఒకే కుటుంబం పెత్తనం చెలాయించేలా బ్యాక్‌డోర్ ప్లాన్ నడుపుతున్నారని జిమ్మీ ఆరోపించారు.
Also Read
ఈ గొడవకు అసలు పునాది 2013-14 మధ్య టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో చేసిన మార్పుల్లోనే ఉంది. 1989కి ముందు ట్రస్టులకు, వ్యాపారాలు నడిపే టాటా సన్స్‌కు మధ్య స్పష్టమైన గీత ఉండేది. ట్రస్టులు వ్యాపారాల జోలికి వెళ్లేవి కావు. కానీ, 2012లో సైరస్ మిస్ట్రీని చైర్మన్‌గా చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రొఫెషనల్ చైర్మన్లు స్వతంత్రంగా వ్యవహరించి కంపెనీని తమ గుప్పిట్లోకి తెచ్చుకోకుండా ఉండేందుకు… రతన్ టాటా రంగంలోకి దిగి ట్రస్ట్ నామినీలకు ప్రత్యేక వీటో పవర్స్ కట్టబెట్టారు. నాడు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ట్రస్టుల మధ్య పెత్తనం కోసం నిప్పులు రాజేస్తోంది. ఒకప్పుడు జేఆర్డీ టాటా కాలంలో సుమంత్ మూల్గావ్కర్, దర్బారి సేథ్, రుసీ మోడీ లాంటి ఉద్ధండులకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, కానీ రతన్ టాటా వచ్చాక ఆ పెద్దలందరినీ పక్కన పెట్టారని జిమ్మీ తన లేఖలో గుర్తు చేశారు.
ఈ వివాదంలో మరో కీలకమైన విషయం ట్రస్టుల్లో పదవీకాలం. ట్రస్టీల కాలపరిమితిపై జిమ్మీ టాటా అనేక అభ్యంతరాలు లేవనెత్తారు.ట్రస్టుల్లో కొందరికి నాలుగేళ్ల లిమిట్ పెట్టి, మరికొందరికి ఆ రూల్ వర్తించకుండా వదిలేశారు. దీంతో ట్రస్టీల స్వతంత్రత దెబ్బతిందని, తమకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను పక్కన పెట్టేయడానికి ఇది దారితీసిందని జిమ్మీ మండిపడ్డారు. వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ లాంటి ట్రస్టీల అసమ్మతికి మద్దతుగా ఆయన ఈ మాటలన్నారు. అయితే, లీగల్ నిపుణులు మాత్రం జిమ్మీ వాదనలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రతన్ టాటా బతికున్నప్పుడే 2019లో SRTT లోకి, 2022లో SDTT లోకి నోయెల్ టాటా వచ్చారు. అప్పుడు బోర్డు ట్రస్టీగా ఉన్న జిమ్మీ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు ఏమీ అనకుండా, ఇప్పుడు వ్యవస్థ అంతా తప్పు అని చెప్పడంలో అర్ధం లేదని చెప్తున్నారు. 35 ఏళ్ల కిందటి చట్టాలను ఇప్పుడు మార్చాలని అనడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. టాటా సన్స్ ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని జిమ్మీ టాటా చేస్తున్న డిమాండ్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.కార్పొరేట్ రంగంలో పారదర్శకత ఉండాలని, ప్రస్తుత ఎన్. చంద్రశేఖరన్ లీడర్‌షిప్‌లో గ్రూప్ కంపెనీలు బాగానే నడుస్తున్నాయని జిమ్మీ టాటా చెప్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం టాటా సన్స్‌ను వెంటనే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. టాటా సన్స్ కనుక స్టాక్ మార్కెట్లోకి వస్తే, ఇప్పటివరకు బయటకు పొక్కని గోప్యత అంతా బద్దలవుతుంది. లెక్కలన్నీ పక్కాగా బయటపడతాయి. ఒకవేళ లిస్టింగ్ జరిగితే, దశాబ్దాలుగా ట్రస్టులు అనుభవిస్తున్న అపరిమిత అధికారాల రూల్స్‌ను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇది టాటా సామ్రాజ్యపు పునాదులనే కదిలించే అవకాశం ఉంది.
దేశంలోనే అత్యున్నత విలువలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టాటా గ్రూప్‌లో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఈ గొడవలు కేవలం ఆస్తుల కోసమే కావు. ఇది ఏళ్ల తరబడి నడుస్తున్న పవర్ పాలిటిక్స్ గొడవ. ఒకవైపు ఆర్బీఐ రూల్స్ ప్రకారం కంపెనీని పబ్లిక్‌లోకి తేవాలనే ఒత్తిడి, మరోవైపు పబ్లిక్ ట్రస్టులను కాపాడుకోవాలనే మాటల నడుమ టాటా సామ్రాజ్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం గానీ, ఛారిటీ కమిషనర్ గానీ జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే… సామాన్యుల సంక్షేమం కోసం పెట్టిన నాటి పెద్దల ఆశయాలు నీరుగారిపోయే ప్రమాదం ఉంది!
ప్రజా సంక్షేమం కోసం పెద్దలు నాటిన మహా వృక్షం నీడలో, ఇప్పుడు వారసుల మధ్యే ఆధిపత్య పోరు మొదలైంది. రతన్ టాటా కష్టపడి కట్టిన కార్పొరేట్ కోట గోడల మీద ఇప్పుడు కుటుంబ గొడవల పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ దెబ్బతో టాటా సన్స్ స్టాక్ మార్కెట్ బాట పడుతుందా? లేక ఈ కుటుంబ కలహాలు కార్పొరేట్ హిస్టరీలో మరో కొత్త మలుపు తిరుగుతాయా? వేచి చూడాలి!
: CLN RAJU (EDITOR-NTV DIGITAL)
- Tags
తాజావార్తలు
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
-
MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
-
Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. ‘కాక’ సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!