NTV Telugu Site icon

Dhamaka Movie Review: ధమాకా రివ్యూ

Dhamaka Movie Review

Dhamaka Movie Review

Dhamaka Movie Review: ధమాకా రివ్యూ

రిలీజ్: 23-12-2022
నిడివి: 2గం, 19 ని
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, తులసి, రావు రమేశ్,
చిరాగ్ జానీ, ఆలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్రలోకేశ్, రాజశ్రీనాయర్
సాంకేతిక నిపుణులు
రచన: త్రినాధరావు నక్కిన, ప్రసన్నకుమార్ బెజవాడ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
కెమెరా: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాణం: ఎఎ ఆర్ట్స్, పీపుల్‌ మీడియా
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్,
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

ఈ సంవత్సరం రవితేజ నటించిన రెండు సినిమాలు ‘ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ’ విడదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. ఇక దర్శకుడు త్రినాధరావు నక్కిన ముందు చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ కూడా అంతగా ఆకట్టుకోలేదు. వీరిద్దరి కలయికలో పీపుల్స్ మీడియా సంస్థ అభిషేక్ అగర్వాల్ తో కలసి తీసిన సినిమానే ‘ధమాకా’. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం.

ఆనంద్ చక్రవర్తి (రవితేజ) పీపుల్ మార్ట్ అధినేత సచిన్ ఖేడేకర్ కుమారుడ. స్వామి (రవితేజ) మధ్యతరగతి నేపథ్యం. అతడి తల్లిదండ్రులు వాసుదేవరావు (భరణి), దేవకి (తులసి). స్వామి పావనిని (శ్రీలీల)ను ఇష్టపడతాడు. ఆమె తండ్రి (రావు రమేశ్) తనను ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఇదిలా ఉంటే మరో కార్పొరేట్ సంస్థ అధినేత జెపి (జయరాం) కన్ను పడ్డ సంస్థను నయానో, భయానో స్వాధీనం చేసుకుంటూ వస్తుంటాడు. అతగాడి కన్ను పీపుల్ మార్ట్‌ పై పడ్డపుడు ఏం జరుగుతుంది. శ్రీలీల ఆనంద్, స్వామిలో ఎవరిని ఇష్టపడుతుంది. తన కంపెనీలో వర్కర్లను కూడా భాగస్వాములు చేసి ఆనందంగా కన్నుమూయాలనుకున్న నందగోపాల్ చక్రవర్తి కల నెరవేరుతుందా!? ఆనంద్, స్వామి కవల పిల్లలా? లేక ఒక్కరా? జయరాం ఆటను ఎవరు? ఎలా ముగిస్తారు? అన్నదే ‘ధమాకా’ కథాంశం.

‘ధమాకా’లో మునుపటి రవితేజను చూపిస్తున్నామని ముందు నుంచి దర్శకుడు నక్కిన త్రినాధరావు చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్లే ఫ్యాన్స్ కూడా రవితేజ నుంచి ఆశించే మాస్ ఎంటర్ టైన్ మెంట్ ను వండి వడ్డించాడు. రెండు పాత్రలలో వేరియేషన్ ను రవితేజ కూడా చక్కగా ప్రదర్శించాడు. ఇక శ్రీలీల స్ర్కీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్లామర్‌ను కూడా ఒలకబోసింది. నక్కిన ముందు ఇనిమాలు ‘సినిమా చూపిస్త మామ, నేను లోకల్’ సినిమాలలాగే ‘ధమాకా’ కూడా పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. రవితేజ పాత్రల మధ్య బంధాన్ని బయటపట్టే ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఆడియన్స్ ను ఫుల్ గా ఎంగేజ్ చేశాడు దర్శకుడు. కార్పొరేట్ బ్యాక్‌డ్రాప్ లో కామెడీ, ఫ్యామిలీ డ్రామాను సమపాళ్ళలో మిక్స్ చేశాడు. చూస్తున్నంత సేపు రొటీన్ అని అనిపించినా సన్నివేశాల్లో కొత్తదనం లేకున్నా బోరు కొట్టకపోవడంతో ఈజీగా పాస్ అయిపోతారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే రవితేజ సోలోగా సినిమాను మోశాడనే చెప్పాలి. శ్రీలీల నటిగా కంటే డాన్సర్ గా ఇంప్రెస్ చేస్తుంది. తనికెళ్ల భరణి, సచిన్ ఖేడేకర్, జయరామ్, రావు రమేశ్, తులసి, పవిత్రా లోకేష్, ప్రవీణ్, ఆలీ, హైపర్ ఆది వంటి తెలిసిన ముఖాలు సహాయక పాత్రలలో మెరిసాయి. రావు రమేశ్- హైపర్ ఆది మధ్య కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద రిలీఫ్. సినిమాను నిలబెట్టడంలో ఈ ట్రాక్ చాలా వరకూ దోహదపడిందనే చెప్పాలి. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ఆకర్షణగానే నిలిచాయి. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5

ప్లస్ పాయింట్స్
రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్
రావురమేశ్-హైపర్ ఆది ట్రాక్
మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనం
ఏంజరుగుతుందో తెలవడం

ట్యాగ్ లైన్: ‘ధమాకా’ ఎంటర్ టైనర్

Show comments