Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Ananya Nagalla Tantra Movie Review In Telugu And Rating

Tantra Review: అనన్య నాగళ్ల ‘తంత్ర’ రివ్యూ

Published Date :March 15, 2024 , 3:12 pm
By Bhargav Chaganti
Tantra Review: అనన్య నాగళ్ల ‘తంత్ర’ రివ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.5 / 5

  • MAIN CAST: దినేష్ రఘుముద్రి, అనన్య నాగళ్ల, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు
  • DIRECTOR: శ్రీనివాస్ గోపిశెట్టి
  • MUSIC: ఆర్ఆర్ ధృవన్
  • PRODUCER: నరేష్ బాబు , రవి చైతన్య

Tantra Movie Review: ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలకు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎక్కువగా హారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సహా రక్తం అమ్ముతూ ప్రమోషనల్ కంటెంట్ తో పాటు మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు అంటూ ఒక్క సారిగా ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసిన ఈ తంత్ర సినిమా ఎలా ఉంది? ట్రైలర్ తో భయపెట్టిన తంత్ర సినిమా నిజంగానే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను భయపెట్టిందా ? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

తంత్ర కథ:

ఒక పల్లెటూరిలో తన తండ్రి నానమ్మతో కలిసి జీవిస్తూ ఉంటుంది రేఖ (అనన్య). తన స్నేహితురాలు, ఆమె సోదరుడితో కలిసి కాలేజీకి వెళ్లి వస్తూ ఉంటుంది. అదే ఊరికి చెందిన తేజు(దినేష్ రఘుముద్రి)తో ప్రేమలో పడిన రేఖ తన స్నేహితురాలు మీద ఒక క్షుద్ర ప్రయోగం జరిగిందని తెలిసి దాని నుంచి తప్పిస్తుంది. అయితే ఆమె మీద పగ పెంచుకున్న విగతి(టెంపర్ వంశీ) ఊరికి వచ్చి క్షుద్ర ప్రయోగాలతో ఆమెను చంపాలని చూస్తాడు. ఆ సమయంలో అప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తన ప్రియుడికి చెబుతుంది రేఖ. అయితే అసలు రేఖ ఎవరు? ఆమె తల్లి రాజేశ్వరి (సలోని) ఎలా చనిపోయింది? రాజేశ్వరితో క్షుద్ర ప్రయోగం  చేసిన విగతి ఎందుకు రేఖ మీద పగ పెంచుకుంటాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

నిజానికి హారర్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఆసక్తి. హారర్ నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలను సూపర్ హిట్గా చేసిన హిస్టరీ వారిది. ఇప్పుడు ఇదే హారర్ జానర్లో తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కొత్త కథనా? అంటే కొత్త కథ అని చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి కథలు మనం గతంలో కొన్ని చూసి విని ఉన్నాం. రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవిa అంటూ ‘తంత్ర’ సినిమాలో ఆరు పర్వాలు ఉన్నాయి. అయితేదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. తాంత్రిక విద్యలు, క్షుద్రపూజలు నేపథ్యంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసే పాయింట్ ఉన్నా సినిమా మాత్రం సీరియల్ కంటే స్లోగా సాగుతుంది. స్టోరీ లైన్ తీసుకుంటే  హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో తడబడినట్టు అనిపించింది. అయితే మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు అంటూ ప్రచారం చేసుకుంది సినిమా యూనిట్. అందుకు తగ్గట్టే కొన్ని ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నాయి.  ఇక ‘తంత్ర’లో అనన్యకు ఆత్మలు కనిపించడం తప్ప ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదు. అయితే ఇదే పాయింట్ తో గతంలో వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ లైన్ బాగుంది. స్క్రీన్ ప్లే విషయంలో కేర్ తీసుకుని ఫ్లాష్ బ్యాక్ బలంగా రాసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీహరి సోదరుడి కుమారుడు ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. స్క్రీన్ స్పేస్ తో సంబంధం లేకుండా తన సత్తా చాటే అవకాశం దక్కింది. ఇక మెయిన్ లీడ్ గా తెలుగమ్మాయిగా అందరికీ దగ్గరైన అనన్య ఆత్మలతో మాట్లాడే అమ్మాయిగా, క్షుద్ర పూజలు అన్నీ తెలిసి సైలెంటుగా ప్రియుడి కోసం పరితపించే పాత్రలో అదరగొట్టేసింది. గత సినిమాలతో పోలిస్తే నటనలో ఆమె మరో మెట్టెక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆమెకు నటించే స్కోప్ బాగా దొరకడంతో చెలరేగి నటించింది. ఇక ఇప్పటివరకు హీరోయిన్ గా చేసిన సలోని రోల్, ఆ సీన్స్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి కానీ ఆమె లుక్స్ ని ఫాన్స్ తట్టుకోలేరు. టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాకు తన వంతు తోడ్పాటు అందించారు. కధనం మీద మరింత ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టు ఉంది. కావాలని చేశారో ఏమో తెలియదు కానీ కొన్ని లో కలర్ ప్యాలెట్స్ వాడారు. ఇక సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఫైనల్ గా : హారర్ కథలు ఇష్టపడే వారికి తంత్ర నచ్చొచ్చు..  

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ananya Nagalla
  • Tantra Movie Review
  • Tantra Movie Reviews
  • Tantra Telugu Review

తాజావార్తలు

  • JD Vance: చర్చలు విఫలం.. ఇరాన్ తో ఎలాంటి డీల్ లేదన్న జేడీ వాన్స్

  • Shashi Tharoor: వారే ఆ పాత్రను పోషించగలరు.. పాక్ ప్రధాని పోస్ట్‌పై థరూర్ సెటైర్స్

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions