NTV Telugu Site icon

Aadikeshava Movie Review: ఆది కేశవ రివ్యూ

Aadikeshava

Aadikeshava

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన – దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి

Adikeshava Movie Review: ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయిన పంజా వైష్ణవ తేజ్ ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేశారు. అయితే మొదటి సినిమా ఆడినంత బాగా మరే సినిమా ఆడలేదు. అయితే ఇప్పుడు ఆయన హీరోగా హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, లక్ష్మీ సౌజన్య నిర్మించారు. శ్రీకర బ్యానర్ సహనిర్మించగా అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి .

ఆది కేశవ సినిమా కథ:
చదువు పూర్తి అయినా ఉద్యోగం చేయడం ఇష్టం లేక స్నేహితులతో కలిసి టైం పాస్ చేస్తూ ఉంటాడు బాలు(వైష్ణవ తేజ్). తల్లి కోరిక మేరకు వెళ్లిన మొదటి ఇంటర్వూలోనే ఉద్యోగం తెచ్చుకుంటాడు. తన కంపెనీ సీఈఓ చైత్ర(శ్రీ లీల)తో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ బాలు ఆ ప్రేమ విషయం చెప్పేలోపు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు తనను పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులు (జయప్రకాష్ – రాధిక) తన తల్లితండ్రులే కాదని, ఒక సందర్భంలో తాను కలిసిన మహా కాళేశ్వర్ రెడ్డి( సుమన్) తన తండ్రి అని తెలుస్తుంది. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన చెంగారెడ్డి( జోజు జార్జ్) ను అంతమొందించి సీమకు మంచి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే అసలు చెంగారెడ్డి ఎందుకు మహా కాళేశ్వర్ రెడ్డిని చంపాడు? చైత్రను ప్రేమించిన విషయం బాలు చెప్పాడా? తండ్రి కోరికను బాలు తీర్చాడా? అసలు చెంగా రెడ్డి సీమ మొత్తాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాడు? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలి అంతే సినిమా చూడాల్సిందే .

విశ్లేషణ:
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వైష్ణవ తేజ్ కెరియర్ లో ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ అవుతుందని అందరూ భావించారు. నిజానికి ఉప్పెన సినిమా కూడా ఒక మాస్ యాంగిల్ లోనే సాగుతుంది. ఆ తర్వాత వైష్ణవ తేజ్ చేసిన కొండ పొలం కానీ రంగ రంగ వైభవంగా కానీ ఎందుకో ఆ ఫ్లేవర్ ను మిస్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత వైష్ణవ తేజ్ లోని మాస్ యాంగిల్ మరోసారి బయటకు వస్తుందని అందరూ భావించారు. నిజానికి ఆ యాంగిల్ ని తీసుకువచ్చేందుకు దర్శకుడు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమా కథ మొత్తం చాలా రొటీన్ అనిపిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ప్రతి సీన్ ఊహించగలిగే విధంగా దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకోవడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశమే. ఈ సినిమా కథ ఏమాత్రం కొత్తది కాదు దాదాపు నాలుగైదు సినిమాలు కలిపి మిక్సింగ్ కొట్టి ఈ సినిమా చేశాడా అనిపించేలా దర్శకుడు కథ రాసుకోవడం కానీ స్క్రీన్ ప్లే తో కానీ తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. గాలికి తిరిగే హీరో తండ్రి మాట వినకుండా సరదా సరదాగా గడిపేయడం, ఆ తర్వాత తల్లి ఉద్యోగం తెచ్చుకోమని చెప్పడంతో ఒకే ఒక్క అటెంప్ట్ లో ఉద్యోగం తెచ్చుకుని ఆ ఉద్యోగం ఇచ్చిన అమ్మాయితోనే ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ఎందుకు రియలిస్టిక్ గా అనిపించలేదు. ఏదో మ్యాజిక్ చేసినట్లు ఏమాత్రం లాజిక్స్ కి అందకుండా కథను పరుగులు పెట్టిస్తూ ఉంటాడు దర్శకుడు. అయితే సెకండాఫ్ కు వెళ్ళే ముందు ఇంటర్వెల్ ట్విస్ట్ తో కొంచెం.

ఇంట్రస్ట్ పెంచే ప్రయత్నం చేశాడు. అది కొంత వరకు వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ అంతా సినిమా కాసేపటికి ఒక ట్విస్ట్ తో పరుగులు పెడుతుంది. నిజానికి ఈ సినిమాలో ఎమోషన్స్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కానీ విలన్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కానీ హీరోనిజం ఎలిమెంట్స్ చూపించే విషయంలో కానీ ఎందుకో దర్శకుడు పూర్తిస్థాయిలో సఫలం అయినట్లు అనిపించలేదు. దానికి తోడు ఫైట్లు చేస్తుంటే అసలు ఏమాత్రం లాజిక్ అందకుండా ఇది ఏంట్రా బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే టెస్ట్ మాత్రం భలే ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇవ్వచ్చని ఎవరూ ఊహించరు సినిమా మొదటి నుంచి సెకండ్ హాఫ్ మొదలయ్యే వరకు ప్రతి సీన్ లో తర్వాత వచ్చే సీను ఏమిటి అని సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్ధం అయిపోతుంది.. కానీ ఆ పరిస్థితి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత నుంచి కొంత మారుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమా గురించి ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఒక రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్, ఎలాంటి అంచనాల లేకుండా థియేటర్కు వెళ్లిన వారికి కొంతవరకు నచ్చే అవకాశాలు ఉన్నాయి.

నటీనటులు విషయానికి వస్తే పంజా వైష్ణవ తేజ్ సినిమాలో ఫైట్స్ విషయంలో బాగా షైన్ అయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటిలో అదరగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి నటనలో మెగా హీరోల పోలిక కనిపిస్తోంది, ఆ విషయంలో తేజ్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక శ్రీ లీల పాత్రకు ప్రాధాన్యత లేదు, ఆమె ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉన్నా పర్లేదు అనిపిస్తుంది. ఇక జోకు జార్జ్ భయపెట్టేలా నటించాడు. అపర్ణ దాస్, రాధిక, జయ ప్రకాష్, సుమన్, తనికెళ్ళ భరణి, ఆనంద్, సుదర్శన్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు పూర్తిస్థాయిలో ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు.. పాటలు ఒకటి రెండు వినడానికి బాగున్నాయి , అన్ని గుర్తుంచుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగినట్లుగా సరిపోయింది. కొరియోగ్రాఫర్ వేయించిన స్టెప్పులు మాత్రం భలే ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగినట్టుగా ఉంది. ఎడిటింగ్ క్రిస్పీ గానే ఉంది కానీ మరికొంత నిడివి కట్ చేసే ప్రయత్నం చేయొచ్చు.. నిర్మాణ విలువలు నిర్మాణ సంస్థ స్థాయికి తగినట్టుగా బాగున్నాయి.

ఫైనల్లీ: ఆదికేశవ ఒక రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్.. నాలుగైదు సినిమాలు మిక్సీలో కలిపి కొట్టినట్టు అనిపిస్తుంది కానీ అంచనాలు లేకుండా వెళితే కొందరికి నచ్చొచ్చు.

Show comments