Exxeella Education Group ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విశాఖ నగరంలో గల నోవాటల్ హోటల్ నందు ఆదివారం నిర్వహించడం జరిగింది. దీనిలో 30కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా Rtd.IPS అధికారి శ్రీ జే. డి. లక్ష్మీనారాయణ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనగావించి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియచేస్తూ ఈ మధ్య కాలంలో విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్ధులు ప్రయత్నిస్తూ విదేశాలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి కార్యక్రమంలో తాము ఒక భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దడంలో ఎక్సల్లా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు.
అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నతమైన విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోగలరని, విదేశాలలో చదవడం వలన కేవలం చదువు మాత్రమే కాకుండా విభిన్న సంస్కృతులు తెలుసుకొని మంచి నడవడిక అలవడుతుందని, మన దేశం లో ఇంకా వృద్ది లోకి రాని ప్రొఫెషనల్ కోర్సులను అండర్ గ్రాడ్యుయేషన్ మరియు గ్రాడ్యుయేషన్ దశలోనే నేర్చుకోవడం ద్వారా విద్యార్ధులు మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ఫెయిర్ కి విచ్చేసినందుకు లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెయిర్ లో 500లకు పైగా విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: RSS Rally: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ