తెలుగుదేశం పార్టీకి మహానాడు కీలకం. ఆ వేడుక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు పార్టీ నాయకులు… కార్యకర్తలు. అంతటి కీలకమైన కార్యక్రమానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టేశారు. టీడీపీ హైకమాండ్‌తో గంటాకు సఖ్యత లేదన్నది ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు బహిర్గతమైంది. చంద్రబాబును ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తే ముఖస్తుతి పలకరింపులే దక్కాయట. దాంతో పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు హాజరుకాలేదు గంటా. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో యాక్టివ్…