Prathipadu TDP incharge : అరెస్టు చేయడానికి వెళ్తే.. చీకట్లో జంప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who is Supporting Varupula Raja?
నిధులు దుర్వినియోగంపై నమోదైన కేసులో.. ఆ TDP నేత అజ్ఞాతంలో ఉండడానికి ఎవరు సహకరిస్తున్నారు? అధికారంలో ఉన్నప్పుడు ఆయన వల్ల లబ్ధి పొందినవాళ్లు లీకులు ఇస్తున్నారా? సమస్య తీవ్రత తగ్గేవరకు ఆయన అండర్ గ్రౌండ్ నుంచి బయటకు రారా? ఎవరా నాయకుడు?
Also Read
వరుపుల రాజా. ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్. 2019లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. మధ్యలో ఒకసారి పార్టీ పై విమర్శలు చేసి దూరంగా ఉండి.. తిరిగి పసుపు కండువా కప్పుకొన్నారు. రాజా గతంలో లంపకలోవ PACS ప్రెసిడెంట్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో DCCB చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హస్తానికి హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. లంపకలోవ సొసైటీలో అక్రమాలు జరిగాయని గతంలో సిఐడి కేసు నమోదైంది. 15 కోట్ల మేర అవినీతి జరిగిందని సహకార శాఖ విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత కేసును పోలీసులు దర్యాప్తు చేసి CIDకి బదిలీ చేశారు.
ఆ సమయంలో వెంటనే అలెర్ట్ అయిన వరుపుల హైకోర్టు నుంచి అరెస్ట్ చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే పది రోజుల క్రితం CID అధికారులు గండేపల్లి సొసైటీలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి సిద్ధం అయ్యారు. చనిపోయిన వ్యక్తులు బతికి ఉన్నట్టుగా సంతకాలు పోర్జరీ చేసి కోట్ల రూపాయల నొక్కేశారనేది ఆరోపణ. ఆ కేసులో CIDకి చిక్కకుండా కరెంట్ పోయినప్పుడు రాజా ఎస్కేప్ అయ్యారు. అది జరిగి పది రోజులు గడుస్తున్నా.. టీడీపీ నేత ఎక్కడున్నారో జాడ తెలియడం లేదట.
ఈ మొత్తం వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో రాజా వల్ల లబ్ధి పొందిన కొందరు పోలీసులు ఆయనకు లీకులు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. CID అధికారులు రాజా ఇంటికి వచ్చినప్పుడు స్థానిక పోలీసులు భారీగా మోహరించారు. అదే సమయంలో కరెంట్ పోవడంతో రాజా తప్పించుకోవడం.. అది ఆయన ఒక్కరి వల్ల సాధ్యం కాదని చెవులు కొరుక్కుంటున్నారట. బ్యాక్ బోన్ సపోర్ట్ వల్ల కథ సుఖాంతమైందనే టాక్ నడుస్తోంది. ఎవరో కావాల్సిన వాళ్లు ఉప్పు అందించారని అనుమానిస్తున్నారు.
DCCBలోని కొందరు ఉన్నతాధికారులు ఈ కేసుపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. రాజాను అరెస్ట్ ఛేస్తే తమ పరిస్థితి ఏంటి అని విచారణలో మొత్తం కూపీ లాగుతున్నారట. అసలు ఈ కేసు గురించి అధికారులకు ఎందుకు? వాళ్లెందుకు హైరానా పడుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిఐడి అధికారులు మాత్రం పది రోజులు గడిచినా సీరియస్‌గా లేరనే టాక్ నడుస్తోంది. గతంలో కూడా బెయిల్ వచ్చేంత వరకు ఇలాగే సాగదీశారని గుర్తు చేసుకుంటున్నారట. ఇప్పుడూ అదే జరుగుతుందేమోనని కొందరి సందేహం.
వరపుల రాజా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ముందస్తు సమాచారంతోనే ఎప్పటిలాగే అవుటాఫ్ స్టేషన్‌కి వెళ్లిపోయారని చర్చ జరుగుతోంది. షరా మామూలుగా CID అధికారుల గాలింపు కొనసాగుతోంది. మరి.. దర్యాప్తులో మలుపులు ఉంటాయో లేక పాత సీనే రిపీట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!