Congress: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది? గొడవలకు ఎండ్ కార్డ్ పడిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్‌లోకి వచ్చారు.
ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపై గ్రూపులు ఉండబోవని.. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న ఆదివాసీ మహిళలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే సీతక్కతోపాటు మహేశ్వర్‌రెడ్డి, బలరాం నాయక్, ప్రేమ్‌సాగర్ రావు వర్గం కలిసి రావడం కొత్త పరిణామంగా చెబుతున్నారు. ఒకప్పుడు పేర్లు పలకడానికే ఇష్టపడని నాయకులు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టు కలిసిపోయారట.
Also Read
ఇటీవల జరిగిన నవ సంకల్ప్ సమావేశంలో ప్రేమ్ సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కలహాలు ఎందుకు.. కలిసి నడుద్దామని అక్కడే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సయోధ్యకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తోపాటు AICC కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ చొరవ తీసుకున్నట్టు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి పంచాయితీ లేదని మహేశ్వర్‌రెడ్డి ఆ తర్వాత చేసిన ప్రకటన.. ప్రేమ్ సాగర్‌రావు స్టేట్‌మెంట్ ఒకే టోన్‌లో ఉండటం చర్చగా మారింది.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనూ ఇద్దరు నేతలకు గ్యాప్ ఉండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం వర్కవుట్ అయినట్టు మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రేమ్‌సాగర్‌రావు, మహేశ్వర్‌రెడ్డి కలిసి మీడియా ముందుకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందో అని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ఈ మార్పు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తుందా? ఎన్నికల వరకు ఇలాగే కలిసి ఉంటారా అనే సందేహాలు కేడర్లో లేకపోలేదట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..