Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record West Godavari Tdp Leaders Off The Record

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు ఏమయ్యారు ..? అసలు ఉన్నారా ..?

Published Date :April 17, 2021 , 4:17 pm
By Premchand Chowdary
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు ఏమయ్యారు ..? అసలు ఉన్నారా ..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఒకప్పుడు ఆ జిల్లాలో బలంగా ఉన్న పార్టీకి.. ఇప్పుడు ఇద్దరే ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరిలో ఒకరే యాక్టివ్‌. మంత్రిగా చేసిన వారు సైతం సైలెంట్‌. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా అంతే. దీంతో పార్టీ ఖాళీ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట.  

హేమాహేమీల్లాంటి టీడీపీ నేతలు ఏమైయ్యారు?

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

పశ్చిమగోదావరి జిల్లా. ఒకప్పుడు టీడీపీకి బలమైన జిల్లా. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2019 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లోనే  సైకిల్‌ నిలబడింది. దీనికితోడు రాష్ట్రంలో టీడీపీ పవర్ కోల్పోవడంతో ఆ ఎఫెక్ట్‌ జిల్లాపైనా కనిపించింది. అప్పట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కనుసైగతో జిల్లాను శాసించిన వారు ఒక్క ఓటమితో గప్‌చుప్‌ అయ్యారు. హేమాహేమీల్లాంటి టీడీపీ నాయకులు అనుకున్నవారు సైతం ఏమైపోయారో తెలియని పరిస్థితి. దీంతో  జిల్లాలో తెలుగుదేశం ఖాళీ అయిపోయిందా? చేవ చచ్చిందా అన్న అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. 

వైసీపీ ఎత్తుగడల ముందు తేలిపోతున్న టీడీపీ వ్యూహాలు! 

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ నుంచి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కోలుకుందామని జిల్లాలోని టీడీపీ నేతలు భావించారు. కానీ మరింత చావు దెబ్బ తప్పలేదు. నేతలకే కాదు.. కేడర్‌కు కూడా మైండ్‌ బ్లాంక్‌ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం నడిపించే నాయకులు లేడన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. పంచాయతీలు పోయాయి. మున్సిపాలిటీలలో ఒకటి రెండు వార్డులకే పరిమితమైన దుస్థితి నెలకొంది. ఇక పరిషత్‌ ఎన్నికల సరేసరి. జిల్లాలో వైసీపీ ఎత్తుగడల ముందు టీడీపీ నేతల వ్యూహాలు తేలిపోతున్నాయి. ఎదురు నిలబడటం కాదు కదా.. ఎదురు మాట్లాడే పరిస్థితి లేదు. 

జవహర్‌, పితాని ఉన్నారంటే ఉన్నారంతేనా? 

జిల్లా నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఉన్నారు. మరో మాజీ మంత్రి జవహర్‌ కొవ్వూరులో మళ్లీ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు.  ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. యాక్టివ్‌గా లేరు. పార్టీ పదవులు అనుభవిస్తున్న వీళ్లు అసలు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నారా అన్న అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అది కూడా పాలకొల్లుకే పరిమితం. రాష్ట్రస్థాయిలో నిమ్మల పేరు వినిపిస్తున్నా.. జిల్లాలో మాత్రం అంత సీన్‌ లేదన్నది తమ్ముళ్ల మాట. మరో ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నా లేనట్టే నట. ఉండి నియోజకవర్గంలో ఆయన చప్పుడు చేయడం లేదు.

జనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్న నాయకులు!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో మునుపటి దూకుడు లేదు. కేసుల వల్ల భయపడ్డారో ఏమో సైలెంట్‌ అయిపోయారు. చింతమనేని పరిస్థితిని చూసిన జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు నాకెందుకు వచ్చిన గొడవలే అని సర్దుకున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబుల అలికిడి లేదు. 2004, 2009లో టీడీపీ అధికారంలో లేకపోయినా.. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క విలవిల్లాడాల్సిన దుస్థితి ఎదురైంది. 

పశ్చిమగోదావరిజిల్లా టీడీపీలో ఏం జరుగుతుందో చంద్రబాబు, లోకేష్‌లకు పూర్తిగా తెలుసట. కానీ.. నేతల్లో చురుకు పుట్టించేందుకు వారెలాంటి చర్యలు తీసుకోవడం లేదట. కొన్ని సందర్భాలలో క్షేత్రస్థాయి పరిస్థితులను అర్ధం చేసుకోకుండా నిరసనలకు పిలుపిస్తుండటంతో జనాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారట నాయకులు. ఇదే కాదు.. జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పార్టీకి  ఇంఛార్జులే లేరట. ఇది కూడా కేడర్‌ చెల్లాచెదురు కావడానికి ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు. ఇదే విధంగా అధిష్ఠానం ఉంటే  పార్టీ ఖాళీ కావడం ఖాయమనే ఆందోళనలో ఉంది కేడర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • TDP Leaders
  • west godavari

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions