Off The Record: సై… తేల్చుకుందాం రా…! ఆడో… ఈడో.. కాదు. ఊరి నడిబొడ్డున మీటింగ్ పెడదాం. నువ్వేంటో నేనేంటో మాట్లాడదామంటూ తొడ గొడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇద్దరూ వేర్వేరు పార్టీల వాళ్ళయితే అది వేరే సంగతి. కానీ…. అధికార టీడీపీకి చెందిన నాయకులే అవడం, ఒకకరు సిట్టింగ్, మరొకరు మాజీ ఎమ్మెల్యే కావడంతో కేడర్‌లో కంగారు పెంచుతోందట. ఎవరా ఇద్దరు? ఎందుకలా వీధికెక్కారు?
Read Also: Deputy cm pawan kalyan : గెలిస్తే ఒక న్యాయం ఓడిపోతే ఇంకో న్యాయమా !
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఎక్కడైనా రాజకీయపరమైన గొడవలు జరిగాయంటే….. అది కచ్చితంగా టీడీపీ, వైసీపీ మధ్యనే అనుకోవడం కామన్. కానీ… అనంతపురం అర్బన్‌లో మాత్రం వ్యవహారం బాగా తేడాగా ఉందట. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా వార్ జరుగుతోంది. అదీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే … మాజీ ఎమ్మెల్యే మధ్య కావడంతో… మేటర్ మాంచి రంజుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ 2024 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ టికెట్ సాధించి గెలిచారు. ప్రసాద్‌కు టిక్కెట్ వచ్చినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి వర్గీయుల మధ్య పైకి కనిపించని ఒక యుద్ధం జరుగుతోంది. అయితే గెలిచాక అంతా సర్దుకుంటుందని అనుకున్నా… అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. నగరంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల పేర్లు బయటికి వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. భూ ఆక్రణలు, రిజిస్ట్రేషన్లు, మద్యం షాపులు,వ్యాపారుల నుంచి వసూళ్ళు… ఇలా అన్నిటిలో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also: Swiggy: వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ.. భారీగా ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు!
అయితే, ఇదంతా పక్క పార్టీ వాళ్ళ పని కాదని, సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులేనన్నది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే దగ్గుపాటి వాదన. 14 నెలలుగా ఇలా ఎమ్మెల్యే మీద ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్‌ను పీక్స్‌కు తీసుకువెళ్ళాయి. ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు ఒక ఎత్తైతే.. సాయినగర్ లోని అస్రా ఆప్టికల్స్ స్థల వివాదం ఇంకో ఎత్తు అన్నట్టుగా మారింది. అక్కడ మైనార్టీ కుటుంబం తాముంటున్న క్లినిక్ స్థలాన్ని ఓనర్ నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇదే స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కొత్తగా కొన్న వారు, అసలు ఓనర్ దగ్గర నుంచి వారికి ప్రెజర్ వచ్చిందట. అయితే… దీని వెనక ఉండి కథ నడిపిస్తున్నది.. ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులంటూ ప్రచారం మొదలైంది. దీన్ని ఎమ్మెల్యే వర్గీయులు ఖండించారు. వారం నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులుగా చెబుతున్న వారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీద పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం క్లైమాక్స్‌కు చేరింది. నిన్నటిదాకా పరోక్షంగా విమర్శించుకున్న వారు ఇక ఓపెనైపోయి సవాళ్ళు విసురుకున్నారు.
Read Also: Pakistan Helicopter Crash: పాక్‌లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
ఓ సీనియర్ నాయకుడి కుట్రలు అంటూ ముందు ఓపెనైపోయారు ఎమ్మెల్యే ప్రసాద్. ఏ చిన్న సంఘటన జరిగినా తనతోపాటు తన కుటుంబ సభ్యులను బయటకు లాగుతున్నారని, ఈ 14 నెలల్లో నా కుటుంబ సభ్యుల పేర్ల మీద, నా పేరు మీద ఒక్క సెంటు భూమి కొనలేదన్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఛైర్మన్ గా ఉన్నప్పుడు సొసైటీ భూములు కాజేశారని, పార్టీ ఆఫీసులు తగలపెట్టిన వారు కూడా నా గురించి మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారాయన. తనను ఉద్దేశించి పరోక్షంగా అన్న మాటలకు డైరెక్ట్‌గా ఓపెనైపోయారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. నువ్వు తాగి ఎంతమంది సొంత పార్టీ నాయకులతో అసభ్యంగా మాట్లాడావో.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ ఫైర్ అయ్యారాయన. ఎవరు తాళిబొట్లు తెంచారో… ఎవరు నాయకుల మధ్య గొడవలు పెట్టారో.. ఉదాహరణలతో సహా చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు చౌదరి. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Off The Record: 95 నాటి సీఎం దిశగా చంద్రబాబు యాక్షన్ మొదలైందా?
ఇక, రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైసీపీ నాయకులందరినీ చేరదీసి ఇక్కడ దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నది ఎవరికి తెలియని సంగతులంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇక నువ్వో, నేనో తేల్చుకుందాం రా.. చర్చకు సిద్ధంగా ఉన్నా” అంటూ సవాల్ విసరడంతో కాక రేగింది. దీంతో అనంతపురం తెలుగుదేశం కేడర్‌లో కూడా ఒక్కసారిగా ఏదో తెలియని ఆందోళన పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్ళు విభేదాలున్నా…. ఏదో, లోలోప నడిచేవని, ఇప్పుడు ఇద్దరూ ఇలా ఓపెనైపోవడంతో… ఈ వార్ ఎట్నుంచి ఎటు పోతుందో, పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది టీడీపీ కార్యకర్తల ఆందోళన.
