ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెరాస కసరత్తు ఎంతవరకు వచ్చింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా?
Also Read
అధికార టీఆర్‌ఎస్‌లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటమే ఈ సందడికి కారణం. ఎమ్మెల్సీ పదవి పట్టేందుకు టీఆర్ఎస్‌లో ఆశావహులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సామాజిక సమీకరణాల తూకమే ఇబ్బందిగా మారిందట. ప్రస్తుతం పదవీకాలం ముగిసిన వారిలో ఎక్కువ మంది ఓసీలే. ఇప్పుడు రేస్‌లో ఉన్నది కూడా ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. బీసీలు, ఎస్సీఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే.. ఇటు సంఖ్య తగ్గుతుంది. ఓసీ నేతలను నొప్పించకుండా పందేరం చేపట్టాలి. అదెలా అన్నదే ఇప్పుడు అధికారపార్టీ నేతలకు దిక్కుతోచడం లేదట.
టికెట్ ఆశిస్తున్నవారిలో ఓసీ సామాజికవర్గ నేతలే ఎక్కువ..!
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది టీఆర్ఎస్. ఈ కోటాలో టికెట్ ఆశిస్తున్నవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, తక్కలపల్లి రవీందర్‌రావు.. గతంలో హామీలు పొందినవారు ఉన్నారు. అంతా ఓసీ సామాజికవర్గాలకు చెందిన వారే. గవర్నర్ కోటాలో పెండింగ్‌లో పడిన కౌశిక్‌రెడ్డి భవితవ్యం డైలమాలోనే ఉంది. హుజురాబాద్ ఉపఎన్నిక బ్యాక్ డ్రాప్.. అలాగే రెండోసారి అధికారం చేపట్టాక జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వారిని ఎమ్మెల్సీని చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. వారిలో ఎంత మందికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీలను అకామిడేట్ చేయడం సవాలేనా?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. లోకల్ బాడీలో ఎమ్మెల్సీగా రిటైరైన వారిలోనూ ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. మళ్లీ టికెట్ ఆశిస్తున్నవాళ్లూ వారే.
వచ్చే ఎన్నికలు.. జిల్లాల్లోని పరిస్థితులు.. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది టీఆర్ఎస్. అందుకే ఎస్సీఎస్టీ, బీసీ అభ్యర్థులను ఈ జాబితాలో అకామిడేట్ చేయడం అధికార పార్టీకి పెను సవాలే అన్నది గులాబీ వర్గాల మాట. దీంతో లెక్కలు కొలిక్కి తెచ్చి పార్టీ చేసే ప్రకటనపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు నేతలు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!