Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ – ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు రాఘవ్ జుయల్‌తో కలిసి నిర్వహించిన ‘నో ఫిల్టర్ జస్ట్ డ్రైవ్’ స్పెషల్ చిట్‌చాట్‌లో చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర, ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు.
ది ప్యారడైజ్ ఆఫీస్‌కి సంబంధించిన ఒక అద్భుతమైన మెమొరీని ఈ స్పెషల్ చిట్ చాట్‌లో శ్రీకాంత్ ఓదెల గుర్తుచేసుకున్నారు. అది ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ ఆఫీస్ కానీ, గతంలో సుకుమార్ సర్ డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ ఆఫీస్ అని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్టర్ సుకుమార్ ఏ రూంలో, ఏ కుర్చీలో అయితే కూర్చునేవారో.. సరిగ్గా ఇప్పుడు అదే రూమ్‌లో, సుకుమార్ కూర్చున్న కుర్చీలోనే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా కూర్చుని తన సినిమా పనులను చక్కబెడుతున్నారు. ఈ ప్రయాణం గురించి శ్రీకాంత్ చెబుతూ.. “జీవితం ఒక పూర్తి సర్కిల్లా మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చింది. ఈ గదిలోకి డైరెక్టర్‌గా తొలిసారి అడుగుపెట్టిన రోజు నాలో ఎన్నో రకాల ఎమోషన్స్ కలిగాయి. ఆ కుర్చీలో కూర్చోవాలా? వద్దా? అని కాస్త తడబడ్డాను. ఒకప్పుడు నేను ఎవరి దగ్గరైతే అసిస్టెంట్‌గా నేర్చుకున్నానో, ఈ రోజు అదే గదిలో డైరెక్టర్‌గా కూర్చోవడం నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి” అంటూ ఎమోషనల్ అయ్యారు. మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. టీజర్, సాంగ్స్‌తో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!