Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Trs Bjp Fights On A New Issue

టీఆర్ఎస్, బీజేపీ సరికొత్త కొట్లాట వేడి రాజేస్తోందా..?

Published Date :May 16, 2022 , 11:21 am
By soma gopal
టీఆర్ఎస్, బీజేపీ సరికొత్త కొట్లాట వేడి రాజేస్తోందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్‌ సర్కార్‌. బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్‌ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్‌ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్‌ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు పక్షాల మధ్య కొత్త అంశం సరికొత్త కొట్లాటకు వేడి రాజేస్తోంది.

రుణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన కొత్త విధానాలపై నిప్పులు తొక్కుతున్నారు గులాబీ నాయకులు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రానికి వినిపించారు. అక్కడి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. దీంతో రుణం కోసం రణం చేయాలని రాష్ట్రంలోని అధికారపక్షం డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం మూడు దశల్లో ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే.. వైఖరి మార్చుకోవాలని ఢిల్లీకి లేఖ రాయడం అందులో మొదటిది. స్పందన లేకపోతే.. ఈ నెలాఖరులో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి మోడీ ప్రభుత్వ తీరును శాసనసభలో ఎండగట్టే ప్రయత్నం చేయడం రెండోది. ఈ సందర్భంగా కేంద్రం చేస్తున్న అప్పులు.. ఆర్థిక విధానాలను అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ప్రస్తావించే ఆలోచనలో టీఆర్ఎస్‌ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.

మొదటి, రెండు దశల యుద్ధానికి కేంద్రం చలించకపోతే.. సమస్యను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న వెసులుబాటులను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పరిశీలించే అవకాశం ఉంది. ఇలా మూడు విధానాల్లో పోరాటం చేస్తూనే.. ప్రజల్లో అటెన్షన్‌ తీసుకొచ్చే కార్యక్రమాలకూ రూపకల్పన చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వ వైఖరివల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్‌ పాలకులు. పైగా రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొని ఉండటంతో ఈ అంశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లి పొలిటికల్‌గా పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారట. రుణ అనుమతుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకుంటుందో లేదో తెలియదు. కానీ.. రుణం కోసం చేసే రగడ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • kcr
  • modi
  • Politics
  • TRS

తాజావార్తలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

  • Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

  • Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions