Site icon NTV Telugu

Off The Record: టీ-కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు? క్యాష్ చేసుకుంటున్న బీఆర్ఎస్

Brs

Brs

Off The Record: తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా అపశకునాలు ఎదురవుతున్నాయా? రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయా? వాటిని బేస్‌ చేసుకుని బీఆర్‌ఎస్‌ పుంజుకునేందుకు ప్లాన్‌ చేస్తోందా? అంతలా మారిన ఆ పరిస్థితులు ఏంటి? ఏ విషయంలో గులాబీ రెక్కలు విచ్చుకుంటున్నాయి?

Read Also: Off The Record: తెలంగాణలో పాగా కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు!

సుప్రీంకోర్టు తీర్పులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వానికి వరుసగా షాక్‌లు ఇస్తున్నాయి. దీంతో, దాదాపు రెండేళ్ళుగా సాఫీగానే నడిచిన ప్రభుత్వానికి ఇప్పుడు అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయా అన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో.. తాజాగా బుధవారంనాడు సుప్రీం కోర్ట్‌ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బేనన్న వాదన బలపడుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేసింది సుప్రీం కోర్ట్‌. సరైన అర్హతలు లేవని, అసలు వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయడమే తప్పు అంటూ కీలక తీర్పు ఇచ్చింది. అయితే.. గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది సుప్రీం. గతంలో…బీఆర్‌ఎస్‌ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది.

Read Also: Youth Awardees Meet President: రాష్ట్రపతిని కలిసిన యువజన అవార్డు గ్రహీతలు..

అయితే, వాళ్లకు రాజకీయ నేపథ్యం ఉందంటూ అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దాని మీద అప్పట్లో వాళ్ళిద్దరూ వేర్వేరుగా హైకోర్ట్‌కు వెళ్ళారు. ఆ కేసు నడుస్తుండగానే బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం కాంగ్రెస్ పవర్‌లోకి రావడం జరిగిపోయాయి. ఇక ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయన్న భావనతో వాళ్ళిద్దరి స్థానంలో నిరుడు కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను నామినేట్‌ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తీసుకోవాలని మంత్రివర్గం సిఫారసు చేసి పంపగా.. రాజ్‌భవన్‌ స్టాంప్‌ పడింది. వెంటనే కోదండరామ్‌, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసేశారు. గత జనవరిలో ఈ కార్యక్రమం జరగ్గా.. దాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్ట్‌లో సుప్రీంకోర్ట్‌ తలుపు తట్టారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు. వివిధ దశల్లో వాదనలు జరిగాక…దాదాపు ఏడాది తర్వాత తాజాగా తీర్పు వచ్చింది. కొత్త ఎమ్మెల్సీలు ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్ట్‌ ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బేనన్న విశ్లే,ణలు నడుస్తున్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ… న్యాయం బతికేఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read Also: Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?

పూర్తిగా క్లారిటీ రాని ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్‌ అధికార బలంతో తన అభ్యర్థుల్ని నామినేట్‌ చేసినా… అంతిమంగా సుప్రీం కోర్ట్‌ తీర్పు చెంపపెట్టులా మారిందని అంటున్నారు గులాబీ నాయకులు. ఈ తీర్పు కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లో పడేస్తే… బీఆర్ఎస్‌కు బూస్ట్‌ ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇటీవల వచ్చిన మరో తీర్పు కూడా గులాబీ పార్టీకి మోరల్‌ బూస్ట్‌ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది సుప్రీం కోర్ట్‌. ఇది తమకు అనుకూల నిర్ణయం అంటూ అప్పుడు సంబరాలు చేసుకున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు కచ్చితంగా రద్దవుతాయన్నది వాళ్ళ నమ్మకం. ఫైనల్‌గా ఏం జరుగుతుందన్నది వేరే సంగతిగానీ.. ఆ విషయంలో ఇప్పటికైతే.. కారు పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారట. అదే ఊపులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల విషయంలో కూడా కోర్ట్‌ తలుపు తట్టాలని భావిస్తోంది బీఆర్‌ఎస్‌ అధిష్టానం.

Read Also: Hyderabad: నోటికి ప్లాస్టర్ వేసి.. కళ్ళల్లో పెన్సిల్‌తో పొడిచి.. రెండో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి..

వరుసగా రెండు కోర్ట్‌ తీర్పులు తమకు అనుకూలంగా రావడంతో… తాము ఏం చేసినా న్యాయ బద్ధంగానే చేస్తామని… కాంగ్రెస్ పార్టీ మాత్రం అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం రుజువవుతోందని అంటున్నారు గులాబీ నాయకులు. మరోవైపు ఆసిఫాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ… ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుడు సుప్రీం కోర్ట్‌కు వెళ్ళగా… దాన్ని కూడా కొట్టేసింది. అలా ఇవన్నీ తమకు కలిసొచ్చే అంశాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ వీటిని బేస్‌ చేసుకుని జనంలోకి వెళ్ళాలనుకుంటోందట. ఇలా… వరుసగా మూడు విషయాలు ప్రతిపక్షానికి అనుకూలంగా మారడం, అధికార పార్టీకి అపశకునాలన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఇవి ఏ స్థాయిలో ప్రచారాస్త్రాలుగా మారతాయో చూడాలి మరి.

Exit mobile version